...
...
Next Story

Raksha Bandhan 2026 : ఈరోజే రక్షాబంధన్- మీ సోదరికి మ్యూచువల్​ ఫండ్ SIP గిఫ్ట్​గా ఇవ్వండి..

Mutual fund SIP : ఈ రక్షాబంధన్ వేళ మీ సోదరికి సిస్టమాటిక్ మ్యూచువల్​ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్​ఐపీ) ద్వారా ఆర్థిక భరోసా ఇవ్వడం మంచి ఆలోచనే. ఈ నేపథ్యంలో థర్డ్ పారీ పేమెంట్ రూల్స్, అకౌంట్ హోల్డింగ్, ఇన్కమ్ టాక్స్ మినహాయింపులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Published on: Aug 28, 2026, 05:59:09 IST
Advertisement

పండుగలు, పుట్టినరోజులు లేదా రక్షాబంధన్ వంటి ప్రత్యేక సమయాల్లో తోబుట్టువులకు ఖరీదైన కానుకలు ఇచ్చే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే, దానికంటే వారి భవిష్యత్తు కోసం ఆర్థిక భరోసానిచ్చే ‘సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్’ గిఫ్ట్‌గా ఇవ్వడం మంచి నిర్ణయం. మ్యూచువల్ ఫండ్స్ సుదీర్ఘ కాలంలో మంచి రాబడులను అందిస్తాయి కాబట్టి, ఇది వారి సంపద సృష్టికి బాటలు వేస్తుంది. అయితే, మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా మీ అక్కా లేదా చెల్లి పేరు మీద ఎస్‌ఐపీ ప్రారంభించడం సాధ్యం కాదు.

గిఫ్ట్​గా మ్యూచువల్​ ఫండ్​ ఎస్​ఐపీ- వివరాలు..
గిఫ్ట్​గా మ్యూచువల్​ ఫండ్​ ఎస్​ఐపీ- వివరాలు..

నిబంధనల ప్రకారం వేరొకరి ఖాతా నుంచి థర్డ్-పార్టీ చెల్లింపులకు సెబీ, యాంఫీ అనుమతించవు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐపీని చట్టబద్ధంగా, పన్ను ఇబ్బందులు లేకుండా ఎలా బహుమతిగా ఇవ్వాలో స్పష్టంగా తెలుసుకోండి..

నేరుగా ఎస్‌ఐపీని గిఫ్ట్‌గా ఇవ్వవచ్చా?

మ్యూచువల్ ఫండ్ నిబంధనల ప్రకారం.. మొదటి పెట్టుబడిదారు ఎవరైతే ఉంటారో, వారి బ్యాంక్ ఖాతా నుంచే సొమ్ము కట్ అవ్వాలి. అంటే మీ సోదరి ​ఫోలియోలోకి మీ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా ఈసీఎస్ లేదా ఆటో-డెబిట్ పెట్టడం కుదరదు.

ఈ చిక్కు లేకుండా ఉండేందుకు సులువైన మార్గాలు ఉన్నాయి:

నగదు బదిలీ విధానం: ప్రతినెలా మీ సోదరి బ్యాంక్ ఖాతాకు మీ ఖాతా నుంచి డబ్బులు (ఉదాహరణకు ప్రతినెలా రూ. 10,000) ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. వారు ఆ డబ్బుతో తమ సొంత బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎస్‌ఐపీ పెట్టుబడిని కొనసాగించవచ్చు.

లంప్‌సమ్ / వార్షిక బదిలీ: లేదా ఏడాదికి సరిపడా సొమ్మును (ఉదాహరణకు రూ. 1,20,000) ఒకేసారి వారి అకౌంట్‌కు పంపి, అక్కడ నుంచి ప్రతినెలా రూ. 5,000 లేదా రూ. 10,000 చొప్పున ఎస్‌ఐపీలో పెట్టుబడి పెట్టేలా ప్రణాళిక వేయవచ్చు.

పన్ను మినహాయింపులు ఎలా ఉంటాయి?

ఈ పెట్టుబడి పూర్తిగా మీ సోదరి పేరు మీదనే నమోదు అవుతుంది. అందువల్ల వారు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు వారి పేరుమీద చెల్లుబాటు అయ్యే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఒకవేళ వారికి ముందే మ్యూచువల్ ఫండ్ ఫోలియో లేకపోతే, మొదటి పెట్టుబడి సమయంలోనే కొత్త ఫోలియో తయారవుతుంది. ఫండ్ యూనిట్లు కేటాయించిన తర్వాత వాటిపై పూర్తి హక్కులు వారికే ఉంటాయి.

మైనర్ సోదరి ఉంటే ఏం చేయాలి?

ఒకవేళ మీ సోదరి మైనర్ (18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) అయితే నిబంధనలలో కొంత మినహాయింపు ఉంది. మైనర్ పేరు మీద ఫోలియో ఉన్నప్పటికీ, ఆ ఖాతాను తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ పర్యవేక్షిస్తారు. యాంఫీ థర్డ్-పార్టీ పేమెంట్ మినహాయింపుల ప్రకారం, బంధువులు లేదా తల్లిదండ్రులు మైనర్లకు గిఫ్ట్‌గా ఇచ్చే పెట్టుబడులకు సంబంధించి ఒక విడత ఎస్‌ఐపీ వాయిదా రూ. 50,000 వరకు నేరుగా చెల్లించే వెసులుబాటు ఉంది. అయితే దీనికి కేవైసీ పత్రాలతో పాటు థర్డ్ పార్టీ పేమెంట్ డిక్లరేషన్ ఫారం సమర్పించాల్సి ఉంటుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe