...
...
Next Story

RCB vs MI : లాస్ట్​ ఓవర్ థ్రిల్లర్​! ఆర్సీబీని గెలిపించిన భువీ- ప్లేఆఫ్స్​ రేసు నుంచి ఎంఐ, ఎల్​ఎస్​జీ ఔట్..

IPL 2026 : రాయ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కృనాల్ పాండ్యా (73) మెరుపు ఇన్నింగ్స్, భువనేశ్వర్ కుమార్ (4/23) ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరగా, ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి.

Published on: May 11, 2026, 05:27:41 IST
Advertisement

RCB vs MI IPl 2026 : ఐపీఎల్​ 2026లో మరో సంచలనం! ముంబై ఇండియన్స్​పై రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు లాస్ట్​ బాల్​ విక్టరీని అందుకుంది. ఫలితంగా 14 పాయింట్లతో ఈ ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది విరాట్​ కోహ్లీ ఆర్సీబీ. చావోరేవో మ్యాచ్​లో ఓటమి వల్ల ముంబై ఇండియన్స్​ ఈ సీజన్ ప్లేఆఫ్స్​ రేసు నుంచి ఔట్​ అయ్యింది. అంతే కాదు రాయల్​ ఛాలెంజర్స్​ గెలుపు కారణంగా లక్నో సూపర్​ జెయింట్స్​ సైతం ప్లేఆఫ్స్​ రేసు నుంచి నిష్క్రమించింది.

కృనాల్ పాండ్యా వీరోచిత పోరాటం

ఆర్సీబీ ఆటగాళ్లు.. (REUTERS)
ఆర్సీబీ ఆటగాళ్లు.. (REUTERS)

167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాకులు తగిలాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) డకౌట్ కాగా, పడిక్కల్ (12), రజత్ పాటిదార్ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కృనాల్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. కండరాలు పట్టేసినా, పట్టు వదలకుండా పోరాడిన కృనాల్.. 46 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 73 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కాగా చివరి ఓవర్​లో 15 పరుగులు అవసరం పడింది. అప్పటికే ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయింది. మూడో బంతికి షెపర్డ్​ సైతం ఔట్​ అయ్యాడు. ఇక ఆర్సీబీ మ్యాచ్​ ఓడిపోతుందని అందరు అనుకున్నారు. కానీ భువనేశ్వర్​ కుమార్​ అద్భుతం చేశాడు! వస్తూనే 6 బాదేశాడు. అనంతరం 1 బాల్​ 2 రన్స్​ చేయాల్సిన వేళ రసిఖ్ ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు.

ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 4 వికెట్లతో చెలరేగినా, కీలక సమయంలో ఫీల్డర్లు చేసిన తప్పిదాలు ఆ జట్టును దెబ్బతీశాయి. ముఖ్యంగా కృనాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను నమన్ ధీర్, తిలక్ వర్మ పరస్పర అవగాహన లోపంతో చేజార్చడం మ్యాచ్ మలుపు తిప్పింది.

భువీ మ్యాజిక్.. ముంబై విలవిల..

ఆర్సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన చేశాడు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks