Realme 16 5G : 7000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ తరహా డిజైన్‌తో రియల్‌మీ 16- ఇండియాలో త్వరలోనే లాంచ్..!
Realme 16 5G price : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన సరికొత్త 'రియల్‌మీ 16 5జీ'ని త్వరలో భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఐఫోన్ ఎయిర్ తరహా డిజైన్, శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణలు.
టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రియల్‌మీ 16 5జీ' బిగ్ బజ్! ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ఈ ఫోన్, ఇప్పుడు భారత్‌లో లాంచ్ కానుందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. గ్లోబల్ వేరియంట్‌లో ఉన్న ఫీచర్లే ఇండియన్ వెర్షన్‌లోనూ ఉంటాయని సమాచారం.

రియల్‌మీ 16 5జీ- ఐఫోన్ ఎయిర్ తరహా డిజైన్..
ప్రముఖ టెక్ బ్లాగర్ పరాస్ గూగ్లానీ సమాచారం ప్రకారం, రియల్‌మీ 16 5జీతో పాటు 'రియల్‌మీ 16టీ' మోడల్ కూడా త్వరలోనే భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే వీటి ఖచ్చితమైన లాంచ్ తేదీలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
రియల్‌మీ 16 5జీ స్మార్ట్‌ఫోన్ డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ముఖ్యంగా ఐఫోన్ ఎయిర్, గూగుల్ పిక్సెల్ 10 తరహాలో ఉండే 'హారిజాంటల్ కెమెరా బార్' దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
రియల్‌మీ 16 5జీ- స్పెసిఫికేషన్లు (అంచనా)..
డిస్‌ప్లే: 6.57- ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,372 పిక్సెల్స్) ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లే. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్: శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్.
మెమరీ: 12 జీబీ వరకు LPDDR4x ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్.
కెమెరా: వెనుకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్: ఈ ఫోన్‌లో ఏకంగా 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 60డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
రక్షణ: దుమ్ము, ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఈ రియల్‌మీ 16 5జీ ఫోన్‌కు ఐపీ66, ఐపీ68, ఐపీ69 అండ్ ఐపీ69కే రేటింగ్స్ ఉన్నాయి.
రియల్‌మీ 16 5జీ- ధర ఎంత ఉండొచ్చు?
వియత్నాంలో ఈ ఫోన్ 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర సుమారు రూ. 40,000 (వీఎన్డీ 11,490,000) గా ఉంది. అలాగే 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర సుమారు రూ. 44,000 గా నిర్ణయించారు. భారత మార్కెట్‌లో కూడా ధరలు ఇంచుమించుగా ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
కాగా గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్ ‘బ్లాక్ క్లౌడ్’, 'వైట్ స్వాన్' రంగుల్లో అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఇక్కడ దీని ధర ఎంత? అనే విషయాలపై రానున్న కొన్ని వారాల్లో స్పష్టత వస్తుంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
2. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?
ఈ ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనిలోని భారీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ సుమారు 75 నుంచి 85 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగదారులకు ఈ బ్యాటరీ రెండు రోజుల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది.
3. రియల్‌మీ 16 5జీకి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇది ఐఫోన్ లాగే ఉంటుందా?
దీని ప్రధాన ఆకర్షణ 'ఐఫోన్ ఎయిర్' తరహాలో ఉండే హారిజాంటల్ కెమెరా బార్ డిజైన్. దీనివల్ల ఫోన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీనితో పాటు IP69 రేటింగ్ ఉండటం వల్ల ఈ ఫోన్ నీటిలో పడినా, దుమ్ము తగిలినా సురక్షితంగా ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


