7000ఎంఏహెచ్​ బడా బ్యాటరీతో Realme 16 5G లాంచ్​- అదిరే ఫీచర్లు! ధర ఎంతంటే..

రియల్‌మీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ 16 5జీ'ని వియత్నాం మార్కెట్​లో విడుదల చేసింది. 7000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ, అండ్రాయిడ్ 16 ఓఎస్​తో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఈ గ్యాడ్జెట్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 31, 2026, 06:45:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ తన లేటెస్ట్ హ్యాండ్‌సెట్ 'రియల్‌మీ 16 5జీ'ని వియత్నాంలో లాంచ్​ చేసింది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోకి, ముఖ్యంగా భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రెండు విభిన్న రంగుల్లో లభ్యమవుతుండగా, దీని లోపల పవర్​ఫుల్​ 'మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో' చిప్‌సెట్‌ను అమర్చారు. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

రియల్​మీ 16 5జీ..
రియల్​మీ 16 5జీ..

రియల్​మీ 16 5జీ- ధర వివరాలు..

వియత్నాం మార్కెట్​లో రియల్‌మీ 16 5జీ ధరలు ఇలా ఉన్నాయి:

8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్- ధర సుమారు వీఎన్​డీ 1,14,90,000 (భారత కరెన్సీలో దాదాపు రూ. 40,000).

12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్- ధర సుమారు వీఎన్​డీ 1,24,90,000 (భారత కరెన్సీలో దాదాపు రూ. 44,000).

ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్ ‘బ్లాక్ క్లౌడ్’, 'వైట్ స్వాన్' అనే ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం వియత్నాంలో విడుదలైనప్పటికీ, భారత్ సహా ఇతర మార్కెట్లలో దీని లభ్యత గురించి రియల్‌మీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

రియల్‌మీ 16 5జీ- డిస్‌ప్లే, అద్భుతమైన ఫీచర్లు..

రియల్‌మీ 16 5జీ అండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0తో పనిచేస్తుంది. ఇందులో 6.57 ఇంచ్​ ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,372 పిక్సెల్స్) ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. 93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 397పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు వినియోగదారులకు స్మూత్ అనుభూతిని ఇస్తాయి. ఈ డిస్‌ప్లే 240హెచ్​జెడ్​ టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు ఏకంగా 4,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండటం విశేషం. స్క్రీన్ రక్షణ కోసం 'డీటీ స్టార్ డీ+' గ్లాస్‌ను వాడారు.

రియల్‌మీ 16 5జీ- పర్ఫార్మెన్స్​..

ఈ రియల్‌మీ 16 5జీ స్మార్ట్​ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్‌ను వాడారు. దీనికి మాలీ-జీ57 ఎంసీ2 జీపీయూని జత చేశారు. ఇందులో 12జీబీ వరకు LPDDR4x ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్​ఎస్​ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది.

రియల్‌మీ 16 5జీ- కెమెరా సామర్థ్యం..

ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు రెండు కెమెరాలను అమర్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన వైడ్ యాంగిల్ సెన్సార్ (ఆటోఫోకస్‌తో), 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు వైపు ఏకంగా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం సెల్ఫీ ప్రియులకు శుభవార్తే. నైట్ మోడ్, పోర్ట్రెయిట్, సినిమాటిక్, స్లో మోషన్, డ్యూయల్-వ్యూ వీడియో వంటి అనేక షూటింగ్ మోడ్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.

రియల్‌మీ 16 5జీ- కనెక్టివిటీ, సెన్సార్లు..

కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, 5జీ, 4జీ ఎల్​టీఈ, జీపీఎస్, బైడూ, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, వై-ఫై 6 వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేషియల్ రికగ్నిషన్ సదుపాయం ఇచ్చారు. ఇందులో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఇ-కంపాస్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, లేజర్ ఆటోఫోకస్ సెన్సార్, స్పెక్ట్రోఫోటోమీటర్, ఇన్‌ఫ్రారెడ్ కంట్రోల్ వంటి అనేక సెన్సార్లు ఉన్నాయి.

రియల్‌మీ 16 5జీ- భారీ బ్యాటరీ..

రియల్‌మీ 16 5జీ ప్రధాన హైలైట్ దీని 7,000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ. దీనికి 60డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ 158.30x75.13x8.10 ఎంఎం కొలతలతో, సుమారు 183 గ్రాముల బరువు ఉంటుంది. ముఖ్యంగా, దీనికి ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే రేటింగ్స్ ఉన్నాయి. అంటే నీటి నుంచి, ధూళి నుంచి ఈ ఫోన్‌కు పటిష్టమైన రక్షణ లభిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More