బడ్జెట్ ధరలో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి రియల్‌మీ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది! రియల్‌మీ నార్జో 90ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని నేడు భారత్‌లో సేల్‌లోకి తీసుకురానుంది. గత వారమే మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్.. భారీ 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద స్క్రీన్ వంటి అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్స్‌ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రియల్‌మీ నార్జో 90ఎక్స్ 5జీ ధరలు, లాంచ్ ఆఫర్లు, స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
రియల్‌మీ నార్జో 90ఎక్స్ 5జీ- ధర, లాంచ్ ఆఫర్లు..

రియల్‌మీ నార్జో 90ఎక్స్ 5జీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:
- 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: రూ. 13,999
- 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: రూ. 15,499
నైట్రో బ్లూ, ఫ్లాష్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
అయితే లాంచ్ ఆఫర్లలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో రూ. 2,000 విలువైన డిస్కౌంట్ కూపన్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు రియల్‌మీ వెబ్‌సైట్‌లో కొనాలనుకుంటే రూ. 2,000 వరకు బ్యాంక్ ఆఫర్లను పొందవచ్చు. ఈ ఆఫర్లను ఉపయోగిస్తే, బేస్ వేరియంట్‌ను రూ. 11,999 కి, హై-ఎండ్ వేరియంట్‌ను రూ. 13,499 కే సొంతం చేసుకోవచ్చు.
రియల్‌మీ నార్జో 90ఎక్స్- ఫీచర్లు..
డిస్‌ప్లే విషయంలో రియల్‌మీ ఏమాత్రం తగ్గలేదు! 6.80-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్‌తో పాటు గేమింగ్ ప్రియుల కోసం 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో అందించారు. దీనివల్ల ఫోన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ రియల్‌మీ నార్జో 90ఎక్స్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 పై పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం 8జీబీ వరకు ర్యామ్, ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి 128జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX852 మెయిన్ కెమెరా ఉంది. ఇది నాణ్యమైన ఫోటోలను క్లిక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
{{/usCountry}}ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX852 మెయిన్ కెమెరా ఉంది. ఇది నాణ్యమైన ఫోటోలను క్లిక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
{{/usCountry}}ఈ రియల్‌మీ నార్జో 90ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 'టైటాన్' బ్యాటరీ అని చెప్పుకోవాలి! ఏకంగా 7,000ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న ఈ బ్యాటరీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది. దీనికి తోడు 60డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ65 రేటింగ్ ఇచ్చారు.
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి, ముఖ్యంగా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలనుకునే వారికి ఈ రియల్‌మీ నార్జో 90ఎక్స్ 5జీ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.