8000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీతో Realme Neo 8 లాంచ్​- ధర ఎంతంటే..

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త సంచలనం సృష్టించింది. ఏకంగా 8,000ఎంఏహెచ్​ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో 'రియల్‌మీ నియో 8'  స్మార్ట్​ఫోన్​ని లాంచ్ చేసింది. స్మార్ట్​ఫోన్​ ప్రియులను ఉర్రూతలూగించే ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు మీకోసం.

Published on: Jan 23, 2026, 06:45:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రియల్‌మీ నియో 8' ఎట్టకేలకు మార్కెట్లోకి అడుగుపెట్టింది. చైనాలో గురువారం జరిగిన ఒక భారీ ఈవెంట్‌లో రియల్‌మీ సంస్థ ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్​ఫోన్​ని ఆవిష్కరించింది. ఏకంగా 8,000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీని ఇందులో అమర్చడం విశేషం.

రియల్​మీ నియో 8..
రియల్​మీ నియో 8..

రియల్​మీ నియో 8- ధర, లభ్యత..

రియల్‌మీ నియో 8 స్మార్ట్​ఫోన్​ వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. చైనా కరెన్సీ ప్రకారం వీటి ధరలు ఇలా ఉన్నాయి:

12GB + 256GB: సుమారు రూ. 33,000 (2,399 యువాన్లు)

16GB + 256GB: సుమారు రూ. 35,000 (2,699 యువాన్లు)

12GB + 512GB: సుమారు రూ. 38,000 (2,899 యువాన్లు)

16GB + 512GB: సుమారు రూ. 41,000 (3,199 యువాన్లు)

16GB + 1TB: సుమారు రూ. 48,000 (3,699 యువాన్లు)

ప్రస్తుతం ఈ ఫోన్ సైబర్ పర్పుల్, మెక్ గ్రే, ఆరిజిన్ వైట్ రంగుల్లో లభిస్తోంది.

రియల్​మీ నియో 8- ఫీచర్లు, ప్రత్యేకతలు..

రియల్​మీ నియో 8 స్మార్ట్​ఫోన్ కేవలం బ్యాటరీకే పరిమితం కాకుండా, పెర్ఫార్మెన్స్ విషయంలోనూ తగ్గేదేలే అంటోంది.

డిస్‌ప్లే: 6.78 ఇంచ్​ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోంది. ఇది 165హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం వల్ల గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని బ్రైట్‌నెస్ 3,800 నిట్స్‌కు పైగా ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రాసెసర్: క్వాల్కమ్ నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను ఇందులో వాడారు.

కెమెరా: ఫోటోల కోసం ఈ రియల్​మీ నియో 8 స్మార్ట్​ఫోన్​లో వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (ఓఐఎస్​ సపోర్ట్‌తో), 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు.

బ్యాటరీ అండ్​ ఛార్జింగ్: ఈ ఫోన్ హైలైట్ దీని 8,000ఎంఏహెచ్​ బ్యాటరీ. దీనికి తోడు 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఛార్జింగ్ త్వరగా అవ్వడమే కాకుండా, రోజుల తరబడి బ్యాటరీ లైఫ్ వస్తుంది.

రక్షణ: దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు. అంటే భారీ వర్షంలో కూడా ఈ ఫోన్ చెక్కుచెదరదు.

అదనంగా, ఇందులో 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్క్రాచ్ పడకుండా క్రిస్టల్ ఆర్మర్ గ్లాస్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0తో ఈ ఫోన్ పనిచేస్తుంది. రియల్​మీ నియో 8కి మూడు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

ఈ మొబైల్​ ఇండియా లాంచ్​, ధర వంటి వివరాలపై సంస్థ స్పందించాల్సి ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More