ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ భారత మార్కెట్లోకి తన 'పీ' సిరీస్‌లో సరికొత్త 5జీ ఫోన్‌ని ప్రవేశపెట్టింది. గతంలో వచ్చిన 4జీ మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా వస్తున్న ఈ రియల్‌మీ పీ4 లైట్ 5జీ.. ప్రధానంగా భారీ బ్యాటరీ బ్యాకప్, వేగవంతమైన నెట్‌వర్క్ కనెక్టివిటీపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
రియల్‌మీ పీ4 లైట్ 5జీ- ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

ఈ స్మార్ట్‌ఫోన్ ధరను దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన ఫీచర్లను జోడించారు. అవేంటో చూద్దాం..
డిస్‌ప్లే: ఇందులో 6.8- ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ఉంది. విశేషం ఏంటంటే, ఈ ధరలో 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందించడం గమనార్హం. ఇది గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సమయంలో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
ప్రాసెసర్ అండ్ పనితీరు: ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 6 ఎన్ఎం ప్రాసెస్ మీద తయారైంది, దీనివల్ల బ్యాటరీ ఆదా అవ్వడమే కాకుండా 2.4 జీహెచ్‌జెడ్ వరకు క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. హీటింగ్ సమస్య తగ్గించడానికి ఇందులో 5,300 ఎంఎం² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.
POCO X8 Pro : అదిరే ఏఐ ఫీచర్స్‌తో పోకో ఎక్స్8 ప్రో సిరీస్- సేల్ షురూ.. ధర, ఆఫర్లు ఇవే!
కెమెరా: ఈ రియల్‌మీ పీ4 లైట్ 5జీ ఫోన్ వెనుక భాగంలో 13 ఎంపీ మెయిన్ కెమెరా, ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ రెండింటితో 1080పీ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ముఖ్యంగా ‘ఏఐ లైవ్ ఫోటో’, ముందు-వెనుక కెమెరాలతో ఒకేసారి షూట్ చేసే 'డ్యూయల్ వ్యూ వీడియో' వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
{{/usCountry}}కెమెరా: ఈ రియల్‌మీ పీ4 లైట్ 5జీ ఫోన్ వెనుక భాగంలో 13 ఎంపీ మెయిన్ కెమెరా, ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ రెండింటితో 1080పీ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ముఖ్యంగా ‘ఏఐ లైవ్ ఫోటో’, ముందు-వెనుక కెమెరాలతో ఒకేసారి షూట్ చేసే 'డ్యూయల్ వ్యూ వీడియో' వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
{{/usCountry}}బ్యాటరీ: ఈ స్మార్ట్ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. ఈ ధర విభాగంలో ఇంత పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్లు చాలా అరుదు. ఇది 15డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్ అండ్ ఇతరాలు: ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (రియల్‌మీ యూఐ 7) తో పనిచేస్తుంది. వాటర్ అండ్ డస్ట్ నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ ఉంది. ఫోన్ బరువు 212 గ్రాములు, మందం 8.4ఎంఎంగా ఉంది.
రియల్‌మీ పీ4 లైట్ 5జీ- ధర, లభ్యత..
రియల్‌మీ పీ4 లైట్ 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి..
4 GB + 64 GB- రూ. 12,999
4 GB + 128 GB- రూ. 13,999
6 GB + 128 GB- రూ. 15,999
రంగులు: ఇది మోజాయిక్ గ్రీన్, మోజాయిక్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
రియల్‌మీ పీ4 లైట్ 5జీ- ఎప్పుడు కొనవచ్చు?
ఈ ఫోన్ విక్రయాలు మార్చి 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.