10000ఎంఏహెచ్ భారీ​ బ్యాటరీతో Realme P4 Power.. త్వరలోనే ఇండియాలో లాంచ్​

రియల్ మీ పీ4 పవర్ 5జీ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. 10,000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ వంటి అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్ ధర, డిజైన్ వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 20, 2026, 09:10:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్మార్ట్‌ఫోన్ మార్కెట్​లో రియల్​మీ మరో సంచలనానికి సిద్ధమైంది. 'రియల్​మీ పీ4 పవర్ 5జీ' పేరుతో సరికొత్త హ్యాండ్‌సెట్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో 10,000 ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ ఉండటం హైలైట్​. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, జనవరి 29న ఇది మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

రియల్​మీ పీ4 పవర్ 5జీ (Realme)
రియల్​మీ పీ4 పవర్ 5జీ (Realme)

రియల్​మీ పీ4 పవర్​ 5జీ- ధర ఎంత?

ఆన్‌లైన్‌లో లీక్ అయిన రిటైల్ బాక్స్ ఫోటో ప్రకారం.. రియల్​మీ పీ4 పవర్​ 12జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్ (టాప్-ఎండ్ వేరియంట్) ధర రూ. 37,999గా ఉంది. అయితే, సాధారణంగా బాక్స్‌పై ఉన్న ధర కంటే అసలు మార్కెట్ ధర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ ఫోన్ మరింత అందుబాటు ధరలోనే లభించే అవకాశం ఉంది.

రియల్​మీ పీ4 పవర్​ 5జీ- డిజైన్​..

ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా ఈ స్మార్ట్​ఫోన్ డిజైన్ ఎలా ఉండబోతోందో రియల్​మీ ఒక హింట్ ఇచ్చింది.

ఈ స్మార్ట్​ఫోన్​​ వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్, అందులో మూడు కెమెరాలు ఉన్నాయి.

దీనికి ఫ్లాట్ ఫ్రేమ్, డ్యూయల్-టోన్ రియర్ ప్యానెల్ ఇచ్చారు.

ట్రాన్స్‌సిల్వర్, ట్రాన్స్‌ఆరెంజ్, ట్రాన్స్‌బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభించనుంది.

వెనుక వైపు 'ప్రెసిషన్ ఎనర్జీ లూప్', 'ఫ్లాష్ డార్ట్ ఎంబ్లమ్' వంటి డిజైన్ ఎలిమెంట్స్‌తో పాటు మ్యాట్ ఫినిషింగ్ ఈ స్మార్ట్​ఫోన్​లో ఉండనుంది.

రియల్​మీ పీ4 పవర్​ 5జీ- సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్..

ఈ స్మార్ట్​ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్​మీ యూఐ 7.0తో రానుంది. దీనికి మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అంటే సాఫ్ట్‌వేర్ పరంగా యూజర్లు చాలా కాలం వరకు నిశ్చింతగా ఉండవచ్చు.

రియల్​మీ పీ4 పవర్​ 5జీ- బ్యాటరీ, పర్ఫార్మెన్స్..

ఈ రియల్​మీ పీ4 పవర్​ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం దాని బ్యాటరీ. ఇందులో ఏకంగా 10,000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

డిస్‌ప్లే: 6.78-ఇంచ్​ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే, 144హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్.

ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్.

ఏఐ చిప్: మెరుగైన పనితీరు కోసం ప్రత్యేకంగా 'హైపర్ విజన్+ ఏఐ' చిప్‌ను వాడారు.

రియల్​మీ పీ4 పవర్​ 5జీ- కెమెరా..

ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్​ఫోన్​ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (ఓఐఎస్​ సపోర్ట్‌తో), 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. వాటర్​ అండ్​ డస్ట్​ నుంచి రక్షణ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ కూడా ఉన్నాయి.

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, దీని బరువు కేవలం 219 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More