స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవానికి రెడ్‌మీ సిద్ధమైంది. అసాధారణమైన బ్యాటరీ లైఫ్, అగ్రశ్రేణి పనితీరును కోరుకునే వినియోగదారుల కోసం ‘రెడ్‌మీ టర్బో 5 మాక్స్’ మోడల్‌ను ఈ నెలలో చైనా మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు ఈ షావోమీ సబ్-బ్రాండ్ అధికారికంగా ధృవీకరించింది. దీనికి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్- 9000ఎంఏహెచ్ బ్యాటరీతో..

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఏ షావోమీ ఫోన్‌లోనూ లేని విధంగా ఏకంగా 9000ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన ‘జిన్‌షాజియాంగ్’ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది 10,000ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చే స్థాయి బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ నమ్మకంగా చెబుతోంది. దీనికి తోడు 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉన్నట్లు సమాచారం. బ్యాటరీ అయిపోతుందనే ఆందోళన ఇక ఈ ఫోన్ వాడేవారికి ఉండదు.
రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్- అద్భుతమైన పనితీరు..
ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం బ్యాటరీలోనే కాదు, పవర్ పర్ఫార్మెన్స్‌లోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ నెలలోనే విడుదలైన ‘మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్’ చిప్‌సెట్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్‌గా ఇది నిలవనుంది. అన్‌టుటు బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫోన్ ఏకంగా 32,98,445 పాయింట్లను సాధించి, మార్కెట్లోని ఫ్లాగ్‌షిప్ మోడళ్లకు సవాలు విసురుతోంది.
రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్- డిజైన్, కెమెరా విశేషాలు..
‘ఓషన్ బ్రీజ్ బ్లూ’ రంగులో మెరిసిపోతున్న ఈ ఫోన్ డిజైన్ చాలా ప్రీమియంగా ఉంది.
బాడీ: పటిష్టమైన సీఎన్‌సీ మెటల్ ఫ్రేమ్, ఫైబర్‌గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తోంది.
కెమెరా: వెనుక వైపు పిల్-షేప్ మాడ్యూల్లో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఓఐఎస్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది.
{{/usCountry}}కెమెరా: వెనుక వైపు పిల్-షేప్ మాడ్యూల్లో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఓఐఎస్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది.
{{/usCountry}}డిస్ప్లే: ముందు వైపు పంచ్-హోల్ కెమెరా కటౌట్, చాలా సన్నని బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ డిస్ప్లే ఈ రెడ్‌మీ టర్బో 5 మ్యాక్స్‌లో ఉంది.
చైనాలో దీని ధర సుమారు 2,500 యువాన్లు (సుమారు రూ. 33,000) ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్లో, ముఖ్యంగా భారత్‌లో ఈ ఫోన్ ‘పోకో ఎక్స్8 ప్రో మాక్స్’ పేరుతో రీబ్రాండ్ అయ్యి వచ్చే అవకాశాలు ఉన్నాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.