భారత కార్ల మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న 7 సీటర్ ఎస్‌యూవీ విభాగంలోకి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు రెనాల్ట్, నిస్సాన్ భారీ ప్లాన్‌తో అడుగుపెడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌ను ఏలుతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్, ఎంజీ హెక్టార్ ప్లస్ వంటి పాపులర్ మోడళ్లకు గట్టి సవాల్ విసిరేందుకు రెండు కొత్త 3-రో, 7 సీటర్ ఫ్యామిలీ ఎస్‌యూవీలను సిద్ధం చేస్తున్నాయి!
ఆకట్టుకునే డైమెన్షన్స్.. ధృడమైన ప్లాట్‌ఫామ్

ఈ రెండు ఎస్‌యూవీలను 'ఆర్జీఎమ్‌పీ' (రెనాల్ట్ గ్లోబల్ మోడ్యులర్ ప్లాట్‌ఫామ్) ఆర్కిటెక్చర్‌పై తయారు చేస్తున్నారు. మూడో వరుస ప్రయాణికులకు సైతం తగినంత స్థలం అందించేలా వాహన పొడవుతో పాటు వీల్‌బేస్‌ను పొడిగించారు. వీటి వీల్‌బేస్ 2702 ఎంఎంగా ఉండనుంది. ఇది డస్టర్ మోడల్ కంటే దాదాపు 43 ఎంఎం ఎక్కువ. కారు మొత్తం పొడవు సుమారు 4.6 మీటర్లు ఉండగా, భారతీయ రోడ్లకు తగినట్లుగా 200 ఎంఎం కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అందించనున్నారు.
ప్లాట్‌ఫామ్, గ్లాస్ ఏరియా ఒకేలా ఉన్నప్పటికీ, రెండు బ్రాండ్లు తమ ఐకానిక్ లుక్‌ను ప్రతిబింబించేలా డిజైన్ చేస్తున్నాయి. రెనాల్ట్ మోడల్ అంతర్జాతీయ మార్కెట్లో ప్రజాదరణ పొందిన డాసియా బిగ్‌స్టర్, రెనాల్ట్ బొరియాల్ స్ఫూర్తితో రూపుదిద్దుకోనుండగా, నిస్సాన్ ఎస్‌యూవీ మాత్రం తన గ్లోబల్ ఐకాన్ 'పాట్రోల్' తరహాలో బోల్డ్ ఫ్రంట్ లుక్‌తో రానుంది.
డీజిల్ బంద్.. పవర్‌ఫుల్ పెట్రోల్, హైబ్రిడ్ ఆప్షన్లు!
భారత్‌లో డీజిల్ కార్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేసిన ఈ రెండు కంపెనీలు.. ఈ కొత్త 7 సీటర్ ఫ్యామిలీ ఎస్‌యూవీలలో కేవలం టర్బో పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్లను మాత్రమే ఇస్తున్నాయి.
టర్బో పెట్రోల్: 1.3-లీటర్ 4-సిలిండర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 బీహెచ్పీ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ (4డబ్ల్యూడీ) ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశముంది.
{{/usCountry}}టర్బో పెట్రోల్: 1.3-లీటర్ 4-సిలిండర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 బీహెచ్పీ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ (4డబ్ల్యూడీ) ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశముంది.
{{/usCountry}}స్ట్రాంగ్ హైబ్రిడ్: మైలేజ్ ప్రియుల కోసం 1.8-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ వేరియంట్‌ను తెస్తున్నారు. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. ఇది 160 హెచ్‌పీ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తూ ప్రత్యేకమైన 3-స్పీడ్ హైబ్రిడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది.
లగ్జరీ ఫీచర్లు.. అడ్వాన్స్‌డ్ సేఫ్టీ
వినియోగదారుల కుటుంబ అవసరాలకు తగినట్లుగా 7 సీటర్ (2+3+2) బెంచ్ సీటింగ్ మోడల్‌తో పాటు, రెండో వరుసలో ప్రత్యేకమైన కేప్టెన్ సీట్లు ఉండే 6 సీటర్ (2+2+2) వేరియంట్లను కూడా అందించనున్నారు.
కెబిన్ లోపల 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పానోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వంటి అత్యాధునిక హంగులను జోడించారు. భద్రత విషయానికొస్తే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్పీ, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ మౌంట్లు, 360-డిగ్రీ కెమెరాతో పాటు ప్రమాదాలను నివారించే 'లెవెల్-2 అడాస్' సాంకేతికతను చేర్చారు.
ధర ఎంత ఉండొచ్చు?
తమిళనాడు రాజధాని చెన్నైలోని రెనాల్ట్-నిస్సాన్ ప్లాంట్‌లోనే వీటిని స్థానికంగా తయారు చేయనుండటంతో ధరను చాలా అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీల ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.5 లక్షల నుంచి రూ. 25 లక్షల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది.