మార్చి 17న రాబోతున్న కొత్త తరం డస్టర్ కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుండగా.. రెనాల్ట్ అనూహ్యంగా తన కొత్త ఎస్‌యూవీ 'బ్రిడ్జర్'కి సంబంధించిన కాన్సెప్ట్ టీజర్‌ను వదిలి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ రహస్యంగా ఉంచినప్పటికీ, ఆటోమొబైల్ నిపుణుల్లో దీనిపై అప్పుడే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఇది సబ్-4 మీటర్ సెగ్మెంట్‌లో కంపెనీకి ప్రాతినిధ్యం వహించనుంది. అయితే, ఈ మార్కెట్‌లోని ఇతర కార్లలా కాకుండా, బ్రిడ్జర్ కొన్ని అద్భుతమైన ఆఫ్-రోడ్ క్వాలిటీలతో వస్తుండటం విశేషం.
రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్‌యూవీ- డిజైన్ వెనుక ఆసక్తికరమైన కథనం..
అధికారికంగా కంపెనీ కేవలం ఈ ఎస్‌యూవీ సిల్హౌట్ (ఆకారం), టెయిల్ ల్యాంప్‌ను మాత్రమే ఇటీవల చూపించింది. కానీ, ఈ కొద్దిపాటి సమాచారమే క్రియేటర్ల ఊహలకు రెక్కలు తొడిగింది. టీజర్ ఆధారంగా రూపొందించిన తాజా డిజిటల్ రెండర్లు ఈ ఎస్‌యూవీని చూస్తుంటే ఐకానిక్ ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్’ గుర్తుకు వస్తోంది.
రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్‌యూవీ- డిఫెండర్ తరహా ఫీచర్లు..
డిజిటల్ క్రియేషన్స్‌లో కనిపిస్తున్న వివరాల ప్రకారం.. ఎత్తైన బాక్సీ డిజైన్, వెనుక గేట్‌కు అమర్చిన స్పేర్ వీల్, ఫ్లాట్ రూఫ్, బ్లాక్-అవుట్ పిల్లర్లు, వెడల్పాటి వీల్ ఆర్చెస్ వంటివి ఈ కారుకు ఒక గంభీరమైన రూపాన్ని ఇస్తున్నాయి. అంతేకాకుండా, దీనికి అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్, రగ్గడ్ లుక్ ఇచ్చే రియర్ బంపర్‌ను కూడా జోడించారు.
డిజిటల్ రెండర్లలో స్టీల్ వీల్స్ కనిపించినప్పటికీ, అసలు కాన్సెప్ట్ మోడల్‌లో అవి ఉండే అవకాశం తక్కువ.
రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్‌యూవీ- డస్టర్ పోలికలు ఉండవచ్చా?
డిజైన్ పరంగా డిఫెండర్ ప్రేరణలు ఉన్నప్పటికీ, బ్రిడ్జర్ కాన్సెప్ట్ కొత్తదనాన్ని తీసుకురానుంది. టీజర్లో కనిపించిన టెయిల్ ల్యాంప్ డిజైన్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రెనాల్ట్ తన సిగ్నేచర్ డిజైన్ లాంగ్వేజ్‌ను పాటిస్తూ.. రాబోయే కొత్త డస్టర్‌లో కనిపించే కొన్ని ఫీచర్లను దీనికి కూడా జోడించే అవకాశం ఉంది.
రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్‌యూవీ- ఇంజిన్, ప్లాట్‌ఫారమ్..
{{/usCountry}}డిజైన్ పరంగా డిఫెండర్ ప్రేరణలు ఉన్నప్పటికీ, బ్రిడ్జర్ కాన్సెప్ట్ కొత్తదనాన్ని తీసుకురానుంది. టీజర్లో కనిపించిన టెయిల్ ల్యాంప్ డిజైన్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రెనాల్ట్ తన సిగ్నేచర్ డిజైన్ లాంగ్వేజ్‌ను పాటిస్తూ.. రాబోయే కొత్త డస్టర్‌లో కనిపించే కొన్ని ఫీచర్లను దీనికి కూడా జోడించే అవకాశం ఉంది.
రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్‌యూవీ- ఇంజిన్, ప్లాట్‌ఫారమ్..
{{/usCountry}}రెనాల్ట్ బ్రిడ్జర్ ప్రొడక్షన్ దశకు చేరుకుంటే, అది కంపెనీ మాడిఫైడ్ సీఎంఎఫ్-ఏ+ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడే అవకాశం ఉంది. దీన్ని డస్టర్ కంటే తక్కువ ధరలోనే కంపెనీ మార్కెట్లోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇందులో 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ మోడల్ అధికారికంగా రంగప్రవేశం చేసిన తర్వాతే పూర్తి వివరాలపై స్పష్టత రానుంది.
రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్‌యూవీ- పోటీ ఎవరితో?
మహీంద్రా థార్, మారుతీ సుజుకీ జమ్నీకి ఈ రెనాల్ట్ బ్రిడ్జర్ గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఈ మోడల్ని ఈ మార్చి 10న రెనాల్ట్ సంస్థ ఆవిష్కరించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.