...
...
Next Story

Renault Duster : ఏకంగా 29 కి.మీ మైలేజ్​తో రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ లాంచ్- ధర ఎంతంటే..

రెనాల్ట్ ఇండియా సరికొత్త డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇ-టెక్ 160 ఎస్‌యూవీని రూ. 16.99 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. లీటరుకు 29 కిలోమీటర్ల అద్భుత మైలేజ్ ఇచ్చే ఈ ఎస్​యూవీ వేరియంట్లు, ఇంజిన్, అధునాతన ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 18, 2026, 06:45:46 IST
Advertisement

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో ఇటీవలి కాలంలో హైబ్రిడ్​ మోడల్స్​కి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. మంచి మైలేజ్ ఇస్తున్న ఈ వాహనాలను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రెనాల్ట్.. తన బెస్ట్ సెల్లింగ్, ఐకానిక్ ‘డస్టర్​’ ఎస్​యూవీలో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్​ను తాజాగా లాంచ్​ చేసింది.

2026 Renault Duster Hybrid
2026 Renault Duster Hybrid

ఈ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇ-టెక్ 160 ఎస్‌యూవీ ప్రారంభ ధరను రూ. 16.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ అనే మూడు ఆకర్షణీయమైన వేరియంట్లలో ఇది లభిస్తుంది. అధికారిక డీలర్‌షిప్‌లు, ఆన్‌లైన్ పోర్టల్‌ ద్వారా ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించారు.

ఫార్ములా 1 టెక్నాలజీ.. శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్!

సాంకేతిక సామర్థ్యం విషయానికి వస్తే.. రెనాల్ట్ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌లో 1.8-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో అనుసంధానించారు. ఈ పవర్‌ట్రెయిన్ మొత్తం 160 పీఎస్ పవర్​ని, 208 ఎన్​ఎం పీక్ మోటార్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ ఒంటరిగా 110 పీఎస్ ఇస్తే, ట్రాక్షన్ మోటార్ 50 పీఎస్ పవర్ అందిస్తుంది.

ఫార్ములా 1 రేసింగ్ ప్రోగ్రామ్ ద్వారా అభివృద్ధి చేసిన సాంకేతికతతో రూపొందించిన మల్టీ-మోడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఇందులో ఉపయోగించారు. ఇందులో 2 ఎలక్ట్రిక్ గేర్లు, 4 పెట్రోల్ ఇంజిన్ గేర్లు ఉన్నాయి. ఇవి రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా మొత్తం 15 డ్రైవింగ్ కాంబినేషన్లను ఇస్తాయి.

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్- 29 కి.మీ మైలేజ్, 1,400 కి.మీల ప్రయాణం!

ఈ ఎస్​యూవీకు ఎలాంటి ఎక్స్‌టర్నల్ ఛార్జింగ్ కనెక్షన్ అవసరం లేదు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా బ్యాటరీ దానంతట అదే ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఛార్జ్‌ను తదుపరి అవసరాల కోసం దాచుకోవడానికి 'E-Save' మోడ్‌ను కూడా అందించారు. ఇది కేవలం 9.61 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 1,400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. హైబ్రిడ్ బ్యాటరీకి కంపెనీ 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీని ఇస్తోంది.

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్- బోల్డ్ డిజైన్, లగ్జరీ ఫీచర్లు..

వెలుపలి భాగంలో ఫ్రంట్ గ్రిల్‌లో వెలిగే ఆకర్షణీయమైన డస్టర్ లోగో, ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్‌లను అమర్చారు. రోడ్డుపై గంభీరమైన లుక్ కోసం 18-ఇంచుల అలాయ్ వీల్స్, కఠినమైన రహదారులను సైతం అధిగమించడానికి 212 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 26.9 డిగ్రీల అప్రోచ్ యాంగిల్, 34.7 డిగ్రీల డిపార్చర్ యాంగిల్‌ను ఇచ్చారు.

క్యాబిన్ లోపల 10.1-ఇంచుల మల్టీమీడియా టచ్‌స్క్రీన్, 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, ఆటో-హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, 6-స్పీకర్ అర్కామిస్ ఆడియో సిస్టమ్‌ను పొందుపరిచారు. మృదువైన ప్రయాణం కోసం ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్ సస్పెన్షన్, బ్యాటరీ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. లగేజ్ కోసం పార్శిల్ షెల్ఫ్ కింద 372 లీటర్లు, రూఫ్ వరకు కొలిస్తే 544 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్- వేరియంట్ల వారీగా ధరలు..

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎవల్యూషన్ : రూ. 16.99 లక్షలు

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ టెక్నో (డెసర్ట్ బీజ్ సెమీ-లెథరెట్ సీట్లు): రూ. 18.99 లక్షలు

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎమోషన్ (డ్యూన్ బ్రౌన్ లెథరెట్, వెంటిలేటెడ్, 6-వే పవర్డ్ సీట్లు): రూ. 19.49 లక్షలు

భారత మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడళ్లతో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ సాంకేతికత కలిగిన మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడళ్లకు ఈ కొత్త డస్టర్ హైబ్రిడ్ గట్టి పోటీ ఇవ్వనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks