...
...
Next Story

Renault Kwid facelift : 2026 రెనాల్ట్ క్విడ్ వచ్చేస్తోంది- కొత్త లూక్​తో! లాంచ్ డేట్ ఫిక్స్..

Renault Kwid facelift 2026 : మధ్యతరగతి వాహనదారుల ఆల్‌టైమ్ ఫేవరెట్ హ్యాచ్‌బ్యాక్ రెనాల్ట్ క్విడ్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో అలరించేందుకు సిద్ధమైంది. అప్‌డేటెడ్ ఫీచర్లు, ట్రెండీ డిజైన్‌తో జులై 2, 2026న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. వివరాల్లోకి వెళితే..

Published on: Jun 27, 2026, 06:43:31 IST
Advertisement

భారతదేశపు ఎంట్రీ లెవల్ కార్ల మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ‘రెనాల్ట్’.. తన పాపులర్ మోడల్ క్విడ్​ని సరికొత్త అవతారంలో తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే క్విడ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను జులై 2, 2026న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే, లాంచ్ తేదీని మినహాయించి ఈ కారుకు సంబంధించిన ఇతర వివరాలను కంపెనీ ఇంకా రహస్యంగానే ఉంచింది. ఇటీవలి కాలంలో రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన క్విడ్ స్పై షాట్స్ ఆధారంగా మాత్రం.. ఈ కారులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో కొన్ని విషయాలు తెలిశాయి.

రెనాల్ట్ క్విడ్ ఫేస్​లిఫ్ట్..
రెనాల్ట్ క్విడ్ ఫేస్​లిఫ్ట్..

మన దేశంలో దశాబ్ద కాలంగా విజయవంతంగా సాగుతున్న క్విడ్ ప్రస్థానంలో ఈ సరికొత్త అప్‌డేట్ అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగంలో గ్లోబల్ సేఫ్టీ స్టాండర్డ్స్, టెక్నాలజీ పరంగా గట్టి పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వస్తున్న 2026 రెనాల్ట్ క్విడ్.. మారుతీ సుజుకీ ఆల్టో కే10, సెలెరియో వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

రెనాల్ట్ క్విడ్ ఫేస్​లిఫ్ట్- సరికొత్త లుక్.. గ్లోబల్ డిజైన్ ల్యాంగ్వేజ్..

టెస్టింగ్‌లో కనిపించిన మోడళ్లను గమనిస్తే, 2026 రెనాల్ట్ క్విడ్ ముందు భాగం, రెనాల్ట్ బ్యాడ్జ్, అలాగే టెయిల్ ల్యాంప్స్ చుట్టూ గట్టిగా కవర్‌ చేసినట్లు కనిపించింది. దీన్ని బట్టి చూస్తే కారు బాడీ షేప్‌ను పూర్తిగా మార్చకుండా, కేవలం కాస్మెటిక్ మార్పులకే పరిమితమైనట్లు అర్థం చేసుకోవచ్చు. రెనాల్ట్ అంతర్జాతీయ మార్కెట్లలో వాడుతున్న సరికొత్త గ్లోబల్ డిజైన్ శైలికి అనుగుణంగా దీని గ్రిల్, బంపర్లు, హెడ్‌లైట్స్ డిజైన్‌ను మార్చనున్నారు. ముఖ్యంగా కొత్త తరం డస్టర్‌ను పోలిన వై-షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఈ కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇవ్వనున్నాయి.

రెనాల్ట్ క్విడ్ ఫేస్​లిఫ్ట్- క్యాబిన్ లోపల మారనున్న ఫీచర్లు..

సాంకేతిక పరంగా ఈ రెనాల్ట్ క్విడ్ ఫేస్​లిఫ్ట్ వర్షెన్​లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ప్రస్తుతమున్న 1.0-లీటర్, త్రీ-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే ఇందులోనూ కొనసాగించనున్నారు. ఇది గరిష్టంగా 65 బీహెచ్​పీ పవర్​ని, 96 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులకు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ ఏఎంటీ (ఆటోమేటిక్) ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks