2026 Renault Kwid : భారీ మార్పులతో బడ్జెట్​ ఫ్రెండ్లీ హ్యాచ్​బ్యాక్​- క్విడ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ ఎప్పుడంటే..

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్​.. తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ 'క్విడ్'లో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ ఏడాది భారత్‌లో లాంచ్ చేయబోతోంది. ప్రస్తుతం రోడ్డు టెస్టులు జరుపుకుంటున్న ఈ కారు ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ పరంగా కీలక మార్పులతో వస్తోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 17, 2026, 13:02:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశ బడ్జెట్ కార్ల విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 'రెనాల్ట్​ క్విడ్' ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రజల ముందుకు రాబోతోంది. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ట్రైబర్, కైగర్ మోడళ్లకు అప్‌డేట్స్ ఇచ్చిన ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్​.. ఇప్పుడు తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌ను కూడా ఆధునీకరించే పనిలో పడింది. ప్రస్తుతం ఈ రెనాల్ట్​ క్విడ్ ఫేస్​లిఫ్ట్​ రోడ్ టెస్టులో దర్శనిమిచ్చింది. మారుతీ సుజుకీ ఆల్టో కే10, సెలెరియో వంటి కార్లకు గట్టి పోటీనిచ్చే ఈ 2026 క్విడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రాబోయే మార్పులేంటో ఒకసారి చూద్దాం..

2026 రెనాల్ట్​ క్విడ్
2026 రెనాల్ట్​ క్విడ్

2026 రెనాల్ట్​ క్విడ్- ఎక్స్‌టీరియర్: మరింత స్టైలిష్‌గా..

రోడ్డు టెస్టింగ్ సమయంలో కనిపించిన వివరాల ప్రకారం, 2026 రెనాల్ట్​ క్విడ్​ ఫేస్​లిఫ్ట్​ వెర్షన్‌లో బాహ్య రూపం (ఎక్స్​టీరీయర్​) పరంగా కొన్ని కీలక మార్పులు ఉండబోతున్నాయి.

ముందు భాగం: రీడిజైన్ చేసిన రేడియేటర్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌తో కారు ముఖచిత్రం మారనుంది. బంపర్ కూడా కొత్త లుక్‌లో కనిపించనుంది.

లోగో: తన పైస్థాయి మోడళ్ల లాగే, కొత్త క్విడ్‌లో కూడా మెరిసే బ్రాండ్ లోగోలను మనం చూడవచ్చు.

సైడ్ అండ్​ రేర్: కొత్త డిజైన్ కలిగిన వీల్స్, వెనుక వైపున ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు రానున్నాయి. అలాగే కొన్ని కొత్త కలర్ ఆప్షన్లను కూడా కంపెనీ పరిచయం చేయనుంది.

2026 రెనాల్ట్​ క్విడ్- ఇంటీరియర్: టెక్నాలజీకి పెద్దపీట!

రెనాల్ట్​ క్విడ్ ఫేస్​లిఫ్ట్​ లోపలి భాగంలో (ఇంటీరియర్​) కారు ప్రీమియం అనుభూతినిచ్చేలా కొన్ని అప్‌గ్రేడ్స్ చేయనున్నారు.

డిస్‌ప్లే: ప్రస్తుతం ఉన్న దానికంటే పెద్దదైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉండబోతోంది. ఇది లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

క్లస్టర్: డ్రైవర్ కోసం సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. క్యాబిన్ లేఅవుట్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, అదనపు ఫీచర్లు కారుకు మరింత ఆకర్షణను జోడించనున్నాయి.

2026 రెనాల్ట్​ క్విడ్- ఇంజిన్ సామర్థ్యం: అదే నమ్మకమైన పవర్‌ట్రెయిన్

బయటి రూపం, లోపలి ఫీచర్లు మారినప్పటికీ.. ఇంజిన్ పరంగా ఎటువంటి మెకానికల్ మార్పులు ఉండకపోవచ్చు.

ఇంజిన్: ప్రస్తుత మోడల్‌లో ఉన్న 1.0-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నే ఇందులోనూ కొనసాగించనున్నారు.

పవర్: ఇది గరిష్టంగా 65 బీహెచ్​పీ పవర్, 91 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గేర్ బాక్స్: ఈ హ్యాచ్​బ్యాక్​ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఏఎంటీ (ఆటోమేటిక్) ఆప్షన్లలో లభిస్తుంది.

2026 రెనాల్ట్​ క్విడ్- ధర, పోటీ..

ఈ ఏడాది అక్టోబర్​ నాటికి మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ క్విడ్ ఫేస్‌లిఫ్ట్.. ప్రస్తుతం ఉన్న ధర కంటే స్వల్పంగా పెరిగే ఛాన్స్ ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన ఈ కారు, అప్‌డేటెడ్ ఫీచర్లతో వస్తే సేల్స్​ మరింత పెరగొచ్చని సంస్థ భావిస్తోంది.

ప్రశ్నలు- సమాధానాలు:-

ప్రశ్న- కొత్త రినాల్ట్​ క్విడ్​లో ఇంజిన్ మార్పులు ఉన్నాయా?

సమాధానం- మెకానికల్ పరంగా ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నే ఇందులోనూ కొనసాగిస్తున్నారు. ఇది 65 బీహెచ్​పీ పవర్, 91 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తుంది.

ప్రశ్న- ఇంటీరియర్‌లో వస్తున్న ప్రధాన అప్‌డేట్స్ ఏమిటి?

సమాధానం- క్యాబిన్ లోపల ప్రధానంగా టెక్నాలజీపై దృష్టి సారించారు. ప్రస్తుత మోడల్ కంటే పెద్దదైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లు, డ్రైవర్ కోసం సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఆశించవచ్చు.

ప్రశ్న- మార్కెట్లో ఈ కారు ఏయే మోడళ్లకు పోటీ ఇవ్వనుంది?

సమాధానం- రెనాల్ట్​ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ప్రధానంగా ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతీ సుజుకీ ఆల్టో కే10, మారుతీ సుజుకీ సెలెరియో వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More