మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి! సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ప్రసిద్ధ కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన, ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు శనివారం ఘోర క్షిపణి దాడికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో ఒక అమెరికన్‌తో పాటు మొత్తం 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సౌదీ పౌర విమానయాన అధికారులు వెల్లడించారు.
టర్మినల్స్ 3, 4 పై పడిన మిసైల్..

సౌదీ కాలమానం ప్రకారం శనివారం రాత్రి దేశీయ విమాన సర్వీసులు నడిచే టర్మినల్ 3, టర్మినల్ 4 కాంప్లెక్స్ సమీపంలో ఒక బాలిస్టిక్ క్షిపణి నేరుగా వచ్చి పడింది. దాడి ధాటికి విమానాశ్రయ భవనం పాక్షికంగా కూలిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఇక మరణించిన 12 మందిలో నలుగురు సౌదీ పౌరులు కాగా, ఇద్దరు బంగ్లాదేశీయులు ఉన్నారు. వీరితో పాటు అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన పౌరులు ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
విమాన సర్వీసుల రద్దు.. స్తంభించిన రవాణా!
దాడి జరిగిన వెంటనే భద్రతా కారణాల రీత్యా కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని రకాల విమాన రాకపోకలను సౌదీ అధికారులు తక్షణమే నిలిపివేశారు. రియాద్‌కి రావాల్సిన విమానాలను దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ఫ్లైట్‌రాడార్24, ఫ్లైట్‌అవేర్ నివేదికల ప్రకారం దాదాపు 300కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి!
మరోవైపు దాడి దృశ్యాలను, క్షిపణి విధ్వంసానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సౌదీ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.
"దాడి ఆమోదయోగ్యం కాదు" : డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
{{/usCountry}}రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
{{/usCountry}}"సౌదీ అరేబియాపై జరిగిన ఈ దాడి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై మేము చాలా వేగంగా నిర్ణయం తీసుకుంటాం," అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వెలుపల విలేకరులతో పేర్కొన్నారు.
హూతీ తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా చేపడుతున్న సైనిక చర్యల్లో అమెరికా కూడా నేరుగా భాగస్వామి కావాలో లేదో పరిశీలిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అమాయక పౌరుల ప్రాణాలను తీసే ఉగ్రవాద చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
భారత ప్రభుత్వం సైతం ఈ దాడిని తీవ్రంగా నిరసించింది. దాడి ఆమోదయోగ్యం కాదని స్టేట్మెంట్ విడుదల చేేసింది.
ముదిరిన యెమెన్ యుద్ధం!
కొద్దిరోజుల క్రితమే ఇదే విమానాశ్రయంపై హూతీలు జరిపిన దాడిలో ఒక విమాన పైలట్‌తో పాటు ముగ్గురు సౌదీ పౌరులు మరణించారు. ఇక ఇప్పుడు 12మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ఈ దాడులతో యెమెన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.
యెమెన్ రాజధాని సనా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సౌదీ కూటమి లక్ష్యంగా చేసుకోవడంతో ప్రతికారంగా హూతీలు సౌదీ ఇంధన వనరులు, విమానాశ్రయాలపై దాడులు పెంచారని విశ్లేషకులు భావిస్తున్నారు.