వాట్ ఏ థ్రిల్లర్.. వాట్ ఏ మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ.. సీట్ అంచున కూర్చోబెట్టే పోరు.. లాస్ట్ ఓవర్ డ్రామా.. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విక్టరీ. వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 టైటిల్ ను ఆర్సీబీ దక్కించుకుంది. గురువారం రాత్రి ఉత్కంఠతో ఊపేసిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. 2024లోనూ ఆర్సీబీ విజేతగా నిలిచింది.
కెప్టెన్ స్మృతి మంధాన అదుర్స్

డబ్ల్యూపీఎల్ ఫైనల్.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. రెండోసారి డబ్ల్యూపీఎల్ ట్రోఫీ దక్కించుకోవాలంటే ఈ టోర్నీ హిస్టరీలో ఇంతకుముందెప్పుడూ ఆర్సీబీ ఛేజ్ చేయని స్కోరును ఈ మ్యాచ్ లో చేయాలి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ విజయంపై ధీమాతోనే ఉండి ఉంటుంది. కానీ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆర్సీబీ అమేజింగ్ విక్టరీ సాధించింది.
ధనాధన్ బ్యాటింగ్
భారీ ఛేజింగ్ లో ఆర్సీబీకి గ్రేస్ హారిస్ (9) వికెట్ రూపంలో ఆరంభంలోనే షాక్ తగిలింది. అయినా స్మృతి మంధాన (41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 87) చెలరేగిపోయింది. జార్జియా (54 బంతుల్లో 14 ఫోర్లతో 79)తో కలిసి ఆర్సీబీని విక్టరీ వైపు నడిపించింది స్మృతి మంధాన. ముఖ్యంగా స్మృతి దూకుడుగా ఆడింది. ఎడాపెడా బౌండరీలు బాదేసింది. దీంతో చూస్తుండగానే టార్గెట్ కరుగుతూ వచ్చింది.
లాస్ట్ ఓవర్ డ్రామా
అయితే కీలక సమయంలో స్మృతి మంధాన ఔటైపోయింది. టపటపా మరో రెండు వికెట్లు పడ్డాయి. లాస్ట్ ఓవర్లో ఆర్సీబీ 10 పరుగులు చేస్తే గెలవాల్సిన పరిస్థితి. తెలుగమ్మాయి శ్రీచరణి బౌలింగ్ చేసింది. ఫస్ట్ రెండు బాల్స్ కు రెండు పరుగులే రావడంతో ఉత్కంఠ పెరిగింది. ఏ టీమ్ గెలుస్తుందోననే టెన్షన్ ఊపేసింది. కానీ మూడు, నాలుగు బాల్స్ కు రాధా యాదవ్ ఫోర్లు కొట్టి ఆర్సీబీకి అదిరే విజయాన్ని అందించింది.
నాలుగో ఫైనల్లోనూ
డబ్ల్యూపీఎల్ లో ఫైనల్ చేరడం, ఓడిపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ కు అలవాటుగా మారింది. వరుసగా నాలుగో సారి ఫైనల్లోనూ ఈ టీమ్ కు పరాజయం తప్పలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 8 ఫోర్లతో 57), లారా (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44), హెన్రీ (15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్) చెలరేగి టీమ్ కు భారీ స్కోరు అందించారు. కానీ ఢిల్లీని మరోసారి బ్యాడ్ లక్ వెంటాడింది. ఆర్సీబీ చేతిలో ఓడింది.
{{/usCountry}}డబ్ల్యూపీఎల్ లో ఫైనల్ చేరడం, ఓడిపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ కు అలవాటుగా మారింది. వరుసగా నాలుగో సారి ఫైనల్లోనూ ఈ టీమ్ కు పరాజయం తప్పలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 8 ఫోర్లతో 57), లారా (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44), హెన్రీ (15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్) చెలరేగి టీమ్ కు భారీ స్కోరు అందించారు. కానీ ఢిల్లీని మరోసారి బ్యాడ్ లక్ వెంటాడింది. ఆర్సీబీ చేతిలో ఓడింది.
{{/usCountry}}