...
...
Next Story

Flying Flea S6 : మోటోవర్స్ 2026 హైలైట్.. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ ఎస్6 స్క్రాంబ్లర్!

గోవాలో జరుగుతున్న మోటోవర్స్ 2026 వేడుకలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఫ్లయింగ్ ఫ్లీ ఎస్6 ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ బైక్‌ను ప్రదర్శించింది. 2027లో భారత్‌లో విడుదలయ్యే ఈ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్, హార్డ్‌వేర్, ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 29, 2026, 05:25:57 IST
Advertisement

గోవాలోని వాగేటర్‌లో జరుగుతున్న మోటోవర్స్ 2026 వేడుకలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త ఫ్లయింగ్ ఫ్లీ ఎస్6 ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ బైక్‌ను ప్రదర్శించింది. ఈఐసీఎంఏ 2026లో అంతర్జాతీయంగా సందడి చేసిన తర్వాత స్వదేశంలో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రదర్శించడం ఇదే తొలిసారి. కంపెనీ ఈ-బైక్ శ్రేణిలో ఇది మరింత దృఢంగా, బహుముఖ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది.

రాయల్ ఎన్​ఫీల్డ్ ఫ్లయంగ్ ఫ్లీ ఎస్​6..
రాయల్ ఎన్​ఫీల్డ్ ఫ్లయంగ్ ఫ్లీ ఎస్​6..

నగర ప్రయాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఫ్లయింగ్ ఫ్లీ సీ6 సరసన ఈ ఎస్6 నిలుస్తుంది. అడ్వెంచర్ రైడింగ్ అనుభూతిని అందించేలా దీన్ని తీర్చిదిద్దారు. సీ6 ప్రత్యేక డిజైన్ లక్షణాలను నిలుపుకుంటూనే, నిజమైన స్క్రాంబ్లర్ రూపాన్ని ఇచ్చేందుకు డిజైన్, ఆధార నిర్మాణంలో పలు మార్పులు చేశారు.

రాయల్ ఎన్​ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6- డిజైన్, స్టైలింగ్ విశేషాలు..

సన్నని బాడీ ప్రొఫైల్, బయటకు కనిపించే ఫ్రేమ్, గుండ్రని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో ఫ్లయింగ్ ఫ్లీ ఎస్6 ఆకట్టుకుంటుంది. సిటీ రైడింగ్ కోసం రూపొందించిన సీ6తో (రాయల్ ఎన్​ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్) పోలిస్తే, దీనికి ఎత్తైన ఫ్రంట్ ఫెండర్, వెడల్పాటి హ్యాండిల్‌బార్, చేతులను కాపాడే నకిల్ గార్డ్స్, ఫ్లాట్ సింగిల్-పీస్ సీటు అమర్చారు.

రెండు రకాల రోడ్లపై నడిపేందుకు వీలుగా ఉండే డ్యూయల్-పర్పస్ టైర్లతో వైర్-స్పోక్ వీల్స్ ఇందులో ఉన్నాయి. ఈ స్క్రాంబ్లర్ కఠినమైన రూపాన్ని సంతరించుకుంది. పాతకాలపు రెట్రో శైలిని ఆధునిక ఎలక్ట్రిక్ బైక్ అంశాలతో మేళవించి రూపొందించారు.

రాయల్ ఎన్​ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6- హార్డ్‌వేర్, మెకానికల్ మార్పులు..

ముందు వైపు 19 అంగుళాలు, వెనుక వైపు 18 అంగుళాల వీల్ సెటప్‌తో పాటు రెండు చివర్లలోనూ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. సీ6లో వాడిన బెల్ట్ డ్రైవ్ స్థానంలో సాధారణ చైన్ డ్రైవ్‌ను ఇక్కడ అమర్చారు. తక్కువ వేగంలోనూ వెంటనే స్పందించేలా ఈ ఫైనల్-డ్రైవ్ మార్పు తోడ్పడుతుంది.

రాయల్ ఎన్​ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6- ఫీచర్లు, టెక్నాలజీ ఇలా..

ఫీచర్ల పరంగా ఎస్6లో గుండ్రని 3.5 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు ఇందులో అందుబాటులో ఉంటాయి.

ఆఫ్-రోడ్ కోసం ప్రత్యేక మోడ్‌తో పాటు పలు రైడింగ్ మోడ్‌లు ఈ ఈ-బైక్​లో ఉంటాయని భావిస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వంటి భద్రతా సదుపాయాలు కూడా ఉన్నాయి. కనెక్టెడ్ టెక్నాలజీతో పాటు ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌ల ప్రయోజనం కూడా ఈ బైక్‌కు లభిస్తుంది.

రాయల్ ఎన్​ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6- బ్యాటరీ, రేంజ్, లాంచ్..

రాయల్ ఎన్​ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ ఎస్6 బ్యాటరీ సామర్థ్యం, మోటార్ అవుట్‌పుట్ లేదా రైడింగ్ రేంజ్ వివరాలను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా వెల్లడించలేదు. ఉత్పత్తి దశ విడుదలకు దగ్గరగా ఉన్నప్పుడు ఈ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

2027లో భారత్‌లో ఈ ఈ-బైక్ విక్రయాలు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే కచ్చితమైన విడుదల తేదీ లేదా ధరను కంపెనీ ఇంకా ఖరారు చేయలేదు.

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks