RRB Technician Recruitment : ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్‌కి ఇంకొన్ని రోజులే ఛాన్స్
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్- అప్లికేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు బిగ్ అప్డేట్! రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) వివిధ విభాగాల కోసం నిర్వహిస్తున్న టెక్నీషియన్ పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 6,557 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026 వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : జూన్ 30, 2026
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జులై 29
దరఖాస్తు రుసుము చెల్లింపుకు చివరి తేదీ: జులై 31
అప్లికేషన్ సవరణ ప్రారంభం: ఆగస్టు 1
సవరణలకు చివరి తేదీ: ఆగస్టు 10
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026- ఖాళీల వివరాలు..
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రెండు ప్రధాన కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు:
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 323 పోస్టులు
టెక్నీషియన్ గ్రేడ్-III: 6,234 పోస్టులు
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026- విద్యార్హత, వయోపరిమితి..
ఈ ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026 పోస్టులకు సంబంధించి పూర్తి విద్యా అర్హతలు, కేటగిరీల వారీగా వయోపరిమితి, మినహాయింపుల వివరాల కోసం అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరణాత్మక నోటిఫికేషన్‌ను పరిశీలించవచ్చు.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక విధానం..
ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
కంప్యూటర్ ఆధారిత పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు రుసుము..
అన్ని కేటగిరీల సాధారణ అభ్యర్థులకు: రూ. 500
ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ), మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) అభ్యర్థులకు: రూ. 250
ఈ పరీక్ష రుసుమును కేవలం ఆన్‌లైన్ విధానంలో (ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు లేదా యుపిఐ) మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపుకు అయ్యే సర్వీస్ ఛార్జీలను అభ్యర్థులే భరించాలి.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026- ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
- ముందుగా ఆర్‌ఆర్బీ అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ను సందర్శించండి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న 'RRB Technician Recruitment 2026' రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ ప్రాథమిక వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.
- ఆ తర్వాత లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూర్తి చేయండి.
- నిబంధనల ప్రకారం దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ప్రింటవుట్‌ను దగ్గర ఉంచుకోండి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఆర్‌ఆర్బీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2026 డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


