భారత రూపాయి విలువ పతనమవుతూనే ఉంది! భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో వరుసగా నాలుగో రోజు, డిసెంబర్ 16న కూడా రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయికి చేరింది.
కొత్త రికార్డు కనిష్టం వద్ద రూపాయి..
రూపాయి విలువ జీవితకాల కనిష్ట స్థాయి అయిన 90.82కు పడిపోయింది. సోమవారం నాడు నమోదైన 90.78 అనే రికార్డు కనిష్ట స్థాయిని కూడా ఇది అధిగమించింది.
అమెరికా విధించిన భారీ సుంకాలు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడం ఈ పతనానికి ముఖ్య కారణం. ప్రస్తుతం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం లేని ఏకైక పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమే!
మరోవైపు నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ మార్కెట్‌లో గడువు ముగుస్తున్న పొజిషన్ల కారణంగా డాలర్‌కు డిమాండ్ పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) నిరంతర నిధుల తరలింపు వంటివి మరిన్ని కారణాలు అని నిపుణులు చెబుతున్నారు.
ఈ సంవత్సరంలో ఇప్పటివరకు, భారత రూపాయి ఆసియాలోనే అత్యంత బలహీనమైన పనితీరును కనబరిచిన కరెన్సీగా నిలిచింది! అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ, ఈ ఏడాదిలో ఏకంగా 6% వరకు తగ్గింది.
స్టాక్ మార్కెట్‌పై ప్రభావం..
రూపాయి పతనం దేశీయ స్టాక్ మార్కెట్‌ని ప్రభావితం చేస్తోంది. ఏడాది మొత్తం నష్టాలు చూసిన సూచీలు, ఇటీవలే లాభాల్లోకి వచ్చాయి. కానీ రూపాయి పతనంతో పాటు ఇతర కారణాల వల్ల భారతదేశ 5.2 ట్రిలియన్ డాలర్ల స్టాక్ మార్కెట్ రికవరీ ముప్పులో పడింది. రూపాయి బలహీనత కారణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్ అనిశ్చితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ 375 పాయింట్లు పడి 84,838 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50 118 పాయింట్ల నష్టంతో 25,912 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 341 పాయింట్లు పడి 59,122 వద్ద ఉంది.
{{/usCountry}}మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ 375 పాయింట్లు పడి 84,838 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50 118 పాయింట్ల నష్టంతో 25,912 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 341 పాయింట్లు పడి 59,122 వద్ద ఉంది.
{{/usCountry}}బెంచ్‌మార్క్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ నవంబర్‌లో ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, తిరిగి వెనక్కి తగ్గి, కొంత నష్టాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా డిసెంబర్‌లో, అంతర్జాతీయ ఫండ్‌లు భారతీయ ఈక్విటీల నుంచి ఏకంగా సుమారు రూ. 13 వేల కోట్లు వెనక్కి తీసుకున్నాయి. దీనికి ముందు రెండు నెలల్లో వచ్చిన 1.3 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం పూర్తిగా ఆవిరైపోయింది! విదేశీ పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచే కాకుండా, స్థానిక డెట్ మార్కెట్ నుంచి కూడా తమ డబ్బును ఉపసంహరించుకున్నారు. ఫలితంగా మొత్తం మార్కెట్‌లో నెగిటివ్ సెంటిమెంట్ మొదలైంది.
ఛాయిస్ వెల్త్ రీసెర్చ్ అధిపతి అక్షత్ గార్గ్ మాట్లాడుతూ, "విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలు, రుణాల నుంచి తమ పెట్టుబడులను తగ్గించడం కొనసాగించారు. ఫలితంగా డాలర్ల రూపంలో నిధులు స్థిరంగా బయటకు వెళుతున్నాయి," అని అన్నారు.
"ప్రపంచవ్యాప్త అనిశ్చితి, భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన మూలధన ప్రవాహ సవాళ్ల కలయికతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది," అని ఆయన చెప్పారు.
రూపాయి పడినా లాభపడే స్టాక్స్ ఇవే..!
రూపాయి విలువ బలహీనపడటం వల్ల విదేశాల్లో పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించే కంపెనీలకు, ముఖ్యంగా ఐటీ ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. రూపాయి నష్టాలు పెరిగిన కాలంలోనే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ సెప్టెంబర్ చివరి నుంచి సుమారు 14% వృద్ధిని చూసింది.
సిస్టమ్యాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ ధనంజయ సిన్హా అభిప్రాయం ప్రకారం.. బలహీనమైన రూపాయి, ప్రభుత్వం జారీ చేసే బాండ్లపై రేంజ్ బౌండ్ బాండ్ యీల్డ్స్, సాధారణ ఆదాయ వృద్ధి వంటి అంశాల కారణంగా ఈక్విటీలు రాబోయే రోజుల్లో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎంపిక చేసిన రంగాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
పడిపోతున్న రూపాయి విలువ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్, మెటల్ స్టాక్స్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. అయితే, ఇది బ్యాంకులు, ఇంధన ఉత్పత్తిదారులు, మౌలిక సదుపాయాల కంపెనీలకు నష్టాన్ని కలిగిస్తుందని వివరించారు.