శాంసంగ్ ప్రియులకు అదిరిపోయే వార్త! వచ్చే వారం భారత మార్కెట్లోకి సరికొత్త గెలాక్సీ ఏ-సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఒక టీజర్ వీడియోను విడుదల చేసింది. ఈ ఫోన్ల పేర్లను నేరుగా వెల్లడించనప్పటికీ, లాంచ్ అయ్యేవి గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37 మోడళ్లు అయి ఉంటాయని టెక్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

ఈ నేపథ్యంలో శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
శాంసంగ్ గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37- లాంచ్ వివరాలు..
ఈ కొత్త ఫోన్లు మార్చి 25వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు భారత్‌లో విడుదల కానున్నాయి. ఈ ఫోన్ల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పొందాలనుకునే వారు శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోని “Notify Me” బటన్‌పై క్లిక్ చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37- డిజైన్, కలర్స్..
ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ ఈ ఫోన్లకు సంబంధించిన స్పష్టమైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
డిజైన్: శాంసంగ్ గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37 రెండు ఫోన్లలోనూ సంస్థ సిగ్నేచర్ ‘కీ ఐలాండ్ 2.0’ డిజైన్ కనిపించనుంది. వెనుకవైపు మూడు కెమెరాలు నిలువుగా (Vertical) అమర్చి ఉంటాయి.
డిస్‌ప్లే: ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో హోల్-పంచ్ కటౌట్ ఉంది.
రంగులు: గెలాక్సీ ఏ57 - గ్రే, ఐసీ బ్లూ, లైలాక్, బ్లాక్ రంగుల్లో లభించనుంది. గెలాక్సీ ఏ37 - చార్‌కోల్, గ్రేగ్రీన్, లావెండర్ రంగుల్లో రానుంది.
Realme 16 5G : 7000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ తరహా డిజైన్‌తో రియల్మీ 16- ఇండియాలో త్వరలోనే లాంచ్..!
శాంసంగ్ గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37- కీలక ఫీచర్లు..
{{/usCountry}}Realme 16 5G : 7000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ తరహా డిజైన్‌తో రియల్మీ 16- ఇండియాలో త్వరలోనే లాంచ్..!
శాంసంగ్ గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37- కీలక ఫీచర్లు..
{{/usCountry}}లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ల సాంకేతిక వివరాలు ఇలా ఉండవచ్చు:
డిస్‌ప్లే: గెలాక్సీ ఏ57 స్మార్ట్‌ఫోన్‌లో 6.6- ఇంచ్ ఫుల్-హెచ్‌డీ+ అమోలెడ్ స్క్రీన్, గెలాక్సీ ఏ37లో 6.7- ఇంచ్ ప్యానెల్ ఉండే అవకాశం ఉంది.
ప్రాసెసర్: గెలాక్సీ ఏ57 'ఎక్సినోస్ 1680' చిప్‌సెట్‌తో, గెలాక్సీ ఏ37 'ఎక్సినోస్ 1480' చిప్‌సెట్‌తో పనిచేయనున్నాయి.
కెమెరా: రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
రక్షణ: దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్లకు ఐపీ68 రేటింగ్ లభించే అవకాశం ఉంది.
ఈ రెండు స్మార్ట్ఫోన్లు ప్రీమియం లుక్‌తో పాటు మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునే ధరల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
లాంచ్ రోజున వీటి పూర్తి ధరలు, ఆఫర్ల వివరాలు తెలియనున్నాయి. వాటిని హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అప్డేట్ చేస్తాము. స్టే ట్యూన్డ్!