Samsung Galaxy S26 : నెవర్​ బిఫోర్​ ఫీచర్స్​తో శాంసంగ్​ గెలాక్సీ ఎస్​26 సిరీస్​ లాంచ్​..

Galaxy s26 ultra : శాంసంగ్ తన మోస్ట్ అవేటెడ్ గెలాక్సీ ఎస్​26 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. అద్భుతమైన, నెవర్​ బిఫోర్​ ఏఐ ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, ప్రైవసీ డిస్‌ప్లే వంటి అత్యాధునిక హంగులతో ఎస్​26, ఎస్​26 ప్లస్, ఎస్​26 అల్ట్రా మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Published on: Feb 26, 2026, 05:32:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ 'గెలాక్సీ ఎస్​26'ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన 'గెలాక్సీ అన్‌ప్యాక్డ్' వేదికగా ఈ సరికొత్త ఫోన్లను కంపెనీ పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్​26, గెలాక్సీ ఎస్​26 ప్లస్, ప్రీమియం మోడల్ గెలాక్సీ ఎస్​26 అల్ట్రా ఫోన్లు ఉన్నాయి. చూసేందుకు ఇవి మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉన్నప్పటికీ.. లోపలి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరంగా భారీ మార్పులు చేసింది సంస్ధ. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాము..

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​26 సిరీస్​.. (Shaurya Sharma)
శాంసంగ్​ గెలాక్సీ ఎస్​26 సిరీస్​.. (Shaurya Sharma)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​26- మెప్పించే ఏఐ ఫీచర్లు.. స్మార్ట్ సాఫ్ట్‌వేర్..

గెలాక్సీ ఎస్​26 సిరీస్‌తో శాంసంగ్ తన ఏఐ టూల్స్‌ను మరింత బలోపేతం చేసింది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ‘నౌ నడ్జ్’ అనే ఫీచర్ గురించి! ఇది మీరు ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు సందర్భానికి తగిన సలహాలను ఇస్తుంది. ఉదాహరణకు, మీరు చాటింగ్‌లో ఫోటోల గురించి ప్రస్తావిస్తే వెంటనే రీసెంట్ ఫోటోలను చూపిస్తుంది. అలాగే మీ మెసేజ్‌ల్లో మీటింగ్స్ లేదా షెడ్యూల్స్ గురించి చర్చ వస్తే.. ఆటోమేటిక్‌గా క్యాలెండర్‌ను చెక్ చేస్తుంది.

దీనితో పాటు 'నౌ బ్రీఫ్' అనే ఫీచర్ మీ దైనందిన అలవాట్లను బట్టి రిమైండర్‌లను అందిస్తుంది.

ఇక గూగుల్‌తో కలిసి అందిస్తున్న 'సర్కిల్ టు సెర్చ్' ఇప్పుడు మరింత అడ్వాన్స్‌డ్‌గా మారింది. ఒకే ఫోటోలో ఒకటి కంటే ఎక్కువ వస్తువులను గుర్తించి వాటి గురించి సమాచారాన్ని వెతకవచ్చు. కాల్ స్క్రీనింగ్ ద్వారా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ సారాంశాన్ని కూడా తెలుసుకోవచ్చు.

ప్రైవసీ విషయంలో కూడా శాంసంగ్ రాజీ పడలేదు. యాప్‌లు మీ డేటాను అనవసరంగా వాడుతుంటే వెంటనే 'ప్రైవసీ అలర్ట్స్' వస్తాయి. గ్యాలరీలో కూడా ఫోటోలను దాచుకోవడానికి 'ప్రైవేట్ ఆల్బమ్' సౌకర్యం ఉంది.

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​26 హైలైట్స్​..
శాంసంగ్​ గెలాక్సీ ఎస్​26 హైలైట్స్​..

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​26 అల్ట్రా: పవర్​ఫుల్ పర్ఫార్మెన్స్..

ఈ సిరీస్‌లో అత్యంత ఖరీదైన ఫోన్ ఎస్​26 అల్ట్రా. ఇందులో 6.9 ఇంచ్​ క్యూహెచ్​డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్​ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 'ప్రైవసీ డిస్‌ప్లే' అనే వినూత్న టెక్నాలజీని జోడించారు. దీనివల్ల పక్కన ఉన్న వారికి మీ ఫోన్ స్క్రీన్ కనిపించదు. పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.

ప్రాసెసర్ అండ్​ కెమెరా:

ఈ ఫోన్‌లో 'స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5' ప్రాసెసర్‌ను వాడారు. ఇది మునుపటి కంటే వేగంగా పనిచేయడమే కాకుండా, గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా కొత్త వేపర్ ఛాంబర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

కెమెరా విషయానికి వస్తే.. ఇందులో ఏకంగా 200ఎంపీ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు 50ఎంపీ అల్ట్రా వైడ్, 50ఎంపీ టెలిఫోటో (5ఎక్స్​ జూమ్), 10ఎంపీ టెలిఫోటో (3ఎక్స్​ జూమ్) లెన్స్‌లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ:

5,000ఎంఏహెచ్​ బ్యాటరీతో వచ్చే ఈ స్మార్ట్​ఫోన్ 60డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లోనే 75 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​26, ఎస్​26 ప్లస్..

ఈ రెండు ఫోన్లలో దాదాపు ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉన్నప్పటికీ, స్క్రీన్ సైజు, బ్యాటరీలో మార్పులు ఉన్నాయి. ఎస్​26లో 6.3 ఇంచ్​ డిస్‌ప్లే ఉండగా, ఎస్​26 ప్లస్‌లో 6.7 ఇంచ్​ డిస్‌ప్లే ఉంది.

భారత్‌లో ఈ ఫోన్లు 'ఎక్సినోస్ 2600' ప్రాసెసర్‌తో వస్తున్నాయి.

కెమెరా: 50ఎంపీ మెయిన్ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్, 10ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ: శాంసంగ్​ గెలాక్సీ ఎస్​26లో 4,300ఎంఏహెచ్​, ప్లస్ మోడల్‌లో 4,900ఎంఏహెచ్​ బ్యాటరీని అమర్చారు.

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​26 సిరీస్​- ధర, లభ్యత..

భారత్‌లో ఈ ఫోన్ల ధరల, సేల్ వివరాలను ఫిబ్రవరి 26న శాంసంగ్ అధికారికంగా ప్రకటించనుంది. అయితే, ఇప్పటికే వీటి కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కోబాల్ట్ వైలెట్, వైట్, బ్లాక్, స్కై బ్లూ రంగుల్లో ఇవి లభించనున్నాయి. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో మాత్రమే లభించే పింక్ గోల్డ్, సిల్వర్ షాడో వంటి ప్రత్యేక రంగులు కూడా అందుబాటులో ఉన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో ఉన్న 'ప్రైవసీ డిస్‌ప్లే' ప్రత్యేకత ఏంటి?

ఇది మొబైల్ రంగంలోనే సరికొత్త విప్లవం. మీరు మెట్రో రైలు లేదా కెఫే వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, పక్కన ఉన్న వారు మీ ఫోన్ స్క్రీన్‌ను చూడలేరు. మీరు పాస్‌వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా పర్సనల్ యాప్ వాడుతున్నప్పుడు ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఇది సైడ్ యాంగిల్ నుంచి స్క్రీన్ వ్యూని బ్లాక్ చేస్తుంది, కానీ మీకు మాత్రం కంటెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More