టెక్ దిగ్గజం శాంసంగ్ తన తదుపరి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఏ57’ని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. చైనాకు చెందిన టెలికాం అథారిటీ ‘టెన్నా’ డేటాబేస్‌లో ఈ ఫోన్ తాజాగా దర్శనమిచ్చింది. గత వారమే దీనికి సంబంధించిన రెగ్యులేటరీ లిస్టింగ్ వెలుగులోకి రాగా, ఇప్పుడు అధికారిక చిత్రాలు కూడా బయటకు వచ్చాయి.

ఈ ఫోన్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డేటాబేస్‌లో కూడా కనిపించిన నేపథ్యంలో, గెలాక్సీ ఏ37 మోడల్‌తో కలిసి ఇది త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ57 గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
శాంసంగ్ గెలాక్సీ ఏ57 డిజైన్: మరింత స్లిమ్.. మరింత లైట్!
టెన్నా చిత్రాల ప్రకారం, గెలాక్సీ ఏ57 స్మార్ట్‌ఫోన్ పర్పుల్/లావెండర్ రంగులో మెరిసిపోతోంది. ఇది పాత గెలాక్సీ ఏ56 డిజైన్‌ను పోలి ఉన్నప్పటికీ, దానికంటే చాలా స్లిమ్‌గా, తేలికగా ఉండటం విశేషం. పాత మోడల్ 7.4 ఎంఎం మందం, 198 గ్రాముల బరువు ఉండగా.. కొత్త ఏ57 కేవలం 6.9 ఎంఎం మందం, 182 గ్రాముల బరువుతో రానుంది. శాంసంగ్ తన రాబోయే గెలాక్సీ ఎస్26 సిరీస్‌లో ప్రవేశపెట్టబోయే కొత్త డిజైన్ శైలిని ఈ ఫోన్‌లోనూ చూడవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ57- కీలక ఫీచర్లు (అంచనా)..
డిజైన్ పరంగా పవర్, వాల్యూమ్ బటన్ల కోసం శాంసంగ్ తన సిగ్నేచర్ ‘కీ ఐలాండ్’ లేఅవుట్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొనసాగించింది. వెనుక వైపు నిలువుగా ఉండే కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే:
డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6-ఇంచ్ ఫుల్-హెచ్డీ ప్లస్ (1080 × 2340 పిక్సెల్స్) అమోలెడ్ ప్యానెల్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. ఇది 16 మిలియన్ రంగులకు సపోర్ట్ చేస్తుంది.
{{/usCountry}}డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6-ఇంచ్ ఫుల్-హెచ్డీ ప్లస్ (1080 × 2340 పిక్సెల్స్) అమోలెడ్ ప్యానెల్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. ఇది 16 మిలియన్ రంగులకు సపోర్ట్ చేస్తుంది.
{{/usCountry}}సెక్యూరిటీ: భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను కూడా అందించారు.
ప్రాసెసర్ అండ్ స్టోరేజ్: ఈ ఫోన్‌లో 2.9జీహెచ్‌జెడ్ క్లాక్ స్పీడ్‌తో పనిచేసే సరికొత్త ఎగ్జినోస్ 1680 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది 8జీబీ, 12జీబీ ర్యామ్ వేరియంట్లతో పాటు 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో లభించవచ్చు.
కెమెరా: ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
బ్యాటరీ: ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనికి 45డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ57 అధికారిక లాంచ్ తేదీ, ధర వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, స్లిమ్ డిజైన్, మెరుగైన పర్ఫార్మెన్స్ కోరుకునే మిడ్-రేంజ్ వినియోగదారులకు ఈ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.