...
...
Next Story

6000ఎంఏహెచ్​ బ్యాటరీతో Samsung Galaxy F70 Pro లాంచ్- ధర, ఫీచర్లు..

Samsung Galaxy F70 Pro price : శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ ఓఐఎస్ కెమెరా, 6 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్ల హామీతో వచ్చిన ఈ స్మార్ట్​ఫోన్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 4, 2026, 06:46:07 IST
Advertisement

భారత మార్కెట్లో శాంసంగ్ తన పాపులర్ ఎఫ్-సిరీస్‌ను మరింత విస్తరించింది. ఫిబ్రవరిలో విడుదల చేసిన 'గెలాక్సీ ఎఫ్70ఈ 5జీ' సక్సెస్ తర్వాత, అదే లైనప్‌లో సరికొత్త ‘శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మిడ్-రేంజ్ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేలా భారీ బ్యాటరీ, ఆకట్టుకునే డిస్​ప్లే, సరికొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ను రూపుదిద్దింది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ- వేరియంట్లు, ధర వివరాలు..

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​70 ప్రో..
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​70 ప్రో..

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది:

6GB RAM + 128GB స్టోరేజ్: రూ.25,999

8GB RAM + 128GB స్టోరేజ్: రూ.29,999

8GB RAM + 256GB స్టోరేజ్: రూ.34,999

లాంచ్ ఆఫర్లలో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు ఉపయోగించుకుంటే ఈ ఫోన్‌ను రూ.23,999 ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ 'ఆల్ఫా బ్లాక్', 'ఆరా గ్రీన్' రంగుల్లో లభిస్తుంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు సాంసంగ్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా వినియోగదారులు దీనిని కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ- ఫీచర్లు..

డిస్​ప్లే: గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్​డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోంది. ఇది 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ డిస్​ప్లేకు రక్షణగా గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఇచ్చారు.

ప్రొసెసర్, పర్ఫార్మెన్స్: ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. అత్యంత వేగవంతమైన 8జీబీ వరకు LPDDR5x RAM, 256జీబీ వరకు యూఎఫ్​ఎస్ 3.1 ఇన్-బిల్ట్ స్టోరేజ్ సపోర్ట్ దీని సొంతం.

కెమెరా సెటప్: వెనుక వైపు ట్రిపుల్ కెమెరా వ్యవస్థను అమర్చారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, 5 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉన్న 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

గెలాక్సీ ఏఐ ఫీచర్లు: స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని పెంచడానికి సరికొత్త 'గెలాక్సీ ఏఐ' ఫీచర్లను జోడించారు. గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ వాయిస్ అసిస్టెంట్, ఏఐ వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్, డైరెక్ట్ వాయిస్‌మెయిల్, నౌ బార్ వంటి ఉపయోగకరమైన టూల్స్ ఇందులో లభిస్తాయి.

భారీ బ్యాటరీ - ఛార్జింగ్: ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 45డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటలకు పైగా యూట్యూబ్ వీడియోలు చూడవచ్చని లేదా 8 గంటలకు పైగా గేమింగ్ అడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe