3 స్కీన్స్​, 200ఎంపీ కెమెరాతో Samsung Galaxy Z TriFold.. టెక్నాలజీలో విప్లవం!

టెక్నాలజీలో విప్లవాన్ని సృష్టించింది దిగ్గజ శాంసంగ్ సంస్థ! ప్రపంచంలోనే మొదటి ట్రైఫౌల్డ్​ని లాంచ్​ చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ పేరు  ‘శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్.’ దీని ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 2, 2025, 15:00:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమ అత్యంత ప్రతిష్టాత్మక స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్‌ని ఆవిష్కరించింది శాంసంగ్. ఇది కంపెనీ రూపొందించిన 2 హింజ్​, 3 ఇంటర్​-కనెక్టెడ్​ డిస్​ప్లేలు కలిగిన మొట్టమొదటి పరికరం! ఈ లాంచ్‌తో శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్స్​ సెగ్మెంట్​లో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. ఈ డివైస్ మడిచినప్పుడు జేబులో పెట్టుకోగలిగే ఫోన్‌గా ఉంటూనే, ఓపెన్​ చేసినట్టు ట్యాబ్లెట్-సైజు ఎక్స్​పీరియెన్స్​ని ఇస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్ (Samsung)
శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్ (Samsung)

శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్- డిస్‌ప్లే, డిజైన్ వివరాలు..

గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్ ఓపెన్​ చేసినప్పుడు 10 ఇంచ్​ వైడ్‌స్క్రీన్ లేఅవుట్‌గా మారుతుంది! ఇది పని, వినోదం, మల్టీటాస్కింగ్ కోసం ట్యాబ్లెట్ లాంటి కాన్వాస్‌ను అందిస్తుంది.

మడిచినప్పుడు, రోజువారీ ఉపయోగం కోసం బయటి వైపున 6.5 ఇంచ్​ కవర్ స్క్రీన్​పై మొత్తం గ్యాడ్జెట్​ ఆధారపడుతుంది.

రీడిజైన్డ్​ ఫోల్డింగ్​ స్ట్రక్చర్​, మెటీరియల్స్​ కారణంగా డిస్‌ప్లే క్రీజ్ (మడత రేఖ) గణనీయంగా తగ్గిందని శాంసంగ్ పేర్కొంది.

కొన్ని ప్రయోగాత్మక ఫోల్డబుల్స్‌లో కనిపించే బయటికి చుట్టి ఉండే డిజైన్‌కు బదులుగా, శాంసంగ్ ప్రధాన డిస్‌ప్లే ప్యానెల్‌కు ఇన్వర్డ్​ ఫోల్డింగ్​ మెకానిజన్​ను ఎంచుకుంది.

ఈ హింజ్​ వ్యవస్థకు మధ్యలో టైటానియం ఆర్మర్ ఫ్లెక్స్ హింజ్ ఉంది. దీనికి డ్యూయెల్​ రెయిల్​ స్ట్రక్చర్​, చిన్న మెటల్ రీఇన్​ఫోర్స్​మెంట్​ ప్లేట్​ మద్దతు ఇస్తున్నాయి.

శాంసంగ్ ప్రకారం, ఈ రెండు హింజ్​లు ఒకే పరిమాణంలో లేవు. ఏ ఒక్క ప్యానెల్‌పైనా ఒత్తిడి పెరగకుండా, టెన్షన్​ని సమానంగా పంపిణీ చేయడానికి ఇవి కలిసి పనిచేస్తాయి.

డివైస్ సరిగా ఫోల్డ్​ చేసినప్పుడు వినియోగదారులకు తెలియజేయడానికి హింజ్​ల ఫోల్డ్ సేఫ్టీ అలర్ట్ కూడా అందించింది శాంసంగ్​.

శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్- థిక్​నెస్​, ప్రొటెక్షన్​..

విప్పినప్పుడు ఈ పరికరం మందం మారుతూ ఉంటుంది:

  • అత్యంత సన్నని మూడవ భాగం: 3.9 ఎంఎం.
  • మధ్య ప్యానెల్: 4.2 ఎంఎం.
  • సైడ్ బటన్ ఉన్న భాగం: 4 ఎంఎం.

రీఇన్​ఫర్స్​డ్​ ఓవర్​కోట్​, షాక్-అబ్జార్బింగ్ డిస్‌ప్లే లేయర్ ఈ గ్యాడ్జెట్​ రక్షణను పెంచుతాయి. డివైస్ పూర్తిగా మూసినప్పుడు లోపలి డిస్‌ప్లేలు ఒకదానికొకటి తాకకుండా అల్యూమినియం ఫ్రేమ్ నిరోధిస్తుంది.

శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్- బ్యాటరీ, కెమెరా, మల్టీటాస్కింగ్ ఫీచర్లు..

ట్రైఫోల్డ్‌కు పవర్​ని అందించడానికి 5600 ఎంఏహెచ్​ సామర్థ్యం గల మూడు భాగాల బ్యాటరీ వ్యవస్థ ఉంది. ప్రతి డిస్‌ప్లే ప్యానెల్ వెనుక ఒక బ్యాటరీ సెల్ ఉంటుంది.

వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్​ ఉంది:

200 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ (ప్రధాన కెమెరా)

12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా

10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ (3ఎక్స్​ ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది)

కవర్ డిస్‌ప్లే, ప్రధాన డిస్‌ప్లేలపై అదనంగా రెండు 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

అదనపు స్క్రీన్ స్పేస్​ కొత్త మల్టీటాస్కింగ్ ఫీచర్లకు మార్గం సుగమం చేసింది:

వినియోగదారులు ఒకేసారి మూడు పోర్ట్రెయిట్-సైజ్ యాప్‌లను రన్ చేయవచ్చు.

విండోల పరిమాణాన్ని స్వేచ్ఛగా మార్చవచ్చు లేదా షోలు చూడటానికి మొత్తం 10 ఇంచ్​ లేఅవుట్‌లో కంటెంట్‌ను విస్తరించవచ్చు.

రీడింగ్ మోడ్‌లు, నిలువు యాప్ లేఅవుట్‌లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ “స్టాండలోన్ శాంసంగ్ డెక్స్”ను జోడించింది, కాబట్టి ట్రైఫోల్డ్ దాదాపు ల్యాప్‌టాప్ లాగా పనిచేయగలదు. ఇది నాలుగు వర్క్‌స్పేస్‌లు, ఐదు యాక్టివ్ యాప్‌లకు మద్దతు ఇస్తుంది.

శాంసంగ్ సొంత యాప్‌లను పెద్ద డిస్‌ప్లే కోసం ఆప్టిమైజ్ చేశారు. అలాగే, గూగుల్ జెమినీ లైవ్ అసిస్టెంట్ కూడా ట్రైఫోల్డ్ ఇంటర్‌ఫేస్‌కు అనుగుణంగా మార్చారు.

శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్- మార్కెట్ లభ్యత

శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్ డిసెంబర్ 12న దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత చైనా, తైవాన్, సింగపూర్, యూఏఈలలో విడుదల కానుంది. అమెరికాలో లాంచ్ వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఉంటుంది. ధరను శాంసంగ్ ప్రకటించనప్పటికీ, ఈ ట్రైఫోల్డ్.. కంపెనీలో ఇప్పటికే ఉన్న జెడ్​ ఫోల్డ్ శ్రేణి కంటే ఎక్కువ ధరలో ఉంటుందని అంచనా.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More