Sanju Samson net worth : సంజూ శాంసన్ నెట్ వర్త్ @100 కోట్లు! రూ. 6 కోట్ల బంగ్లా, ఖరీదైన కార్లు..
Sanju Samson : టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజూ శాంసన్, మైదానంలోనే కాకుండా సంపాదనలోనూ సిక్సర్లు కొడుతున్నారు! 2026 నాటికి ఆయన నెట్ వర్త్ రూ. 100 కోట్లకు చేరుకోగా, ఖరీదైన బంగ్లా, ఖరీదైన కార్లతో ఆయన లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ హీరో, కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ క్రేజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. మైదానంలో తన బ్యాటింగ్‌తో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న సంజూ, తెర వెనుక అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కేవలం ఆట ద్వారానే కాకుండా, తెలివైన పెట్టుబడులతో భారీగా ఆస్తులను కూడబెట్టారు. టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో సంజూ శాంసన్ నెట్‌వర్త్, ఇన్వెస్ట్మెంట్స్, లగ్జరీ లైఫ్ గురించి ఇక్కడ ఆసక్తికర వివరాలను తెలుసుకోండి..

సంజూ శాంసన్- తిరువనంతపురంలో 'రాజభవనం'..
సంజూ శాంసన్ తన భార్య చారులతతో కలిసి తిరువనంతపురంలోని ఒక అద్భుతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. సుమారు రూ. 6 కోట్ల విలువైన ఈ ఇల్లు కేరళ సంప్రదాయ శైలి, ఆధునిక ఇంటీరియర్స్ కలయికతో చూడముచ్చటగా ఉంటుంది. ఇందులో అత్యాధునిక జిమ్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇది కాకుండా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూడా ఆయనకు రూ. 4 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
సంజూ శాంసన్- గ్యారేజీలో విలాసవంతమైన కార్లు..
సంజూ శాంసన్‌కు ఖరీదైన కార్లంటే మక్కువ ఎక్కువ. ఆయన గ్యారేజీలో సుమారు రూ. 5 కోట్ల విలువైన రెండు రేంజ్ రోవర్లు (ఆటోబయోగ్రఫీ, స్పోర్ట్) ఉన్నాయి. వీటితో పాటు:
ఆడి ఆర్ఎస్ క్యూ8: రూ. 1 కోటి పైమాటే
లెక్సస్ ఈఎస్ 300హెచ్: రూ. 60 లక్షలు
బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే: రూ. 50 లక్షలు.. వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.
సంజూ శాంసన్- ఐపీఎల్ ప్రయాణం..
సంజూ శాంసన్ ఎదుగుదలలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించింది. 2018 నుంచి 2021 వరకు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఆయనకు ఏడాదికి రూ. 8 కోట్లు చెల్లించగా, 2022లో అది రూ. 14 కోట్లకు చేరింది.
పెరిగిన విలువ: 2025లో రాజస్థాన్ రాయల్స్ ఆయన ధరను రూ. 18 కోట్లకు పెంచింది.
సీఎస్‌కే ఎంట్రీ: 2026లో క్రికెట్ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశమైన మార్పు చోటుచేసుకుంది. ఎంఎస్ ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సంజూను రూ. 18 కోట్లకు దక్కించుకుంది.
మొత్తంగా ఐపీఎల్ కెరీర్ ద్వారా సంజూ ఇప్పటివరకు రూ. 110 కోట్లు ఆర్జించారని నివేదికలు చెబుతున్నాయి.
సంజూ శాంసన్- సంపాదన అండ్ నెట్ వర్త్..
బీసీసీఐ గ్రేడ్-సీ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి రూ. 1 కోటి సంపాదిస్తున్న సంజూ, ఆడే ప్రతి టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు ఫీజుగా అందుకుంటున్నారు. 2026 నాటికి ఆయన మొత్తం నెట్ వర్త్ రూ. 100 కోట్లుగా అంచనా.
టీ20 వరల్డ్ కప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలవడంతో ఆయన బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. ప్రైజ్ మనీతో పాటు రానున్న రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీల బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ద్వారా ఆయన ఆస్తి మరిన్ని రెట్లు పెరిగే అవకాశం ఉంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. సంజూ శాంసన్ ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక పారితోషికం ఎప్పుడు అందుకున్నారు?
సంజూ శాంసన్ కెరీర్‌లో 2025- 2026 సీజన్లు అత్యంత కీలకం. 2025లో రాజస్థాన్ రాయల్స్ ఆయనను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకోగా, 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా అదే భారీ మొత్తానికి (రూ. 18 కోట్లు) ఆయనను సొంతం చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభంలో రూ. 10 లక్షల బేస్ ప్రైస్‌తో మొదలైన ఆయన ప్రయాణం, నేడు వందల కోట్ల ఆదాయానికి చేరుకుంది.
2. అంతర్జాతీయ క్రికెట్‌లో సంజూ శాంసన్ సాధించిన అరుదైన రికార్డు ఏంటి?
సంజూ శాంసన్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన మొదటి భారతీయ వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. అలాగే 2026 టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలవడం ద్వారా ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది భారతీయ ఆటగాళ్ల జాబితాలో చేరిపోయారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


