...
...
Next Story

Tamil Nadu Election Results 2026 : ఒకే ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి సంచలన విజయం - డీఎంకే మంత్రి ఓటమి...!

Tamil Nadu Election Results 2026 : తమిళనాడు ఎన్నికల ఫలితాలు పెను ప్రకంపనలు సృష్టించాయి. విజయ్ స్థాపించిన టీవీకె విజయ దుందుభి మోగించగా…. తిరుపత్తూరు నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిన పోరులో టీవీకే అభ్యర్థి శీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో విక్టరీ కొట్టాడు.

Published on: May 5, 2026, 08:56:18 IST
Advertisement

TVK Victory Tiruppattur : తమిళనాడు రాజకీయ యవనికపై కొత్తగా ఉదయించిన దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) తిరుగులేని విజయాన్ని అందుకుంది. తొలిసారిగా ఎదుర్కొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే సత్తా చాటి… తమిళనాట సరికొత్త చరిత్రకు పురుడు పోసింది.

ఒకే ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి సంచలన విజయం
ఒకే ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి సంచలన విజయం

రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ దిగ్గజాలకు విజయ్ నేతృత్వంలోని టీవీకె కోలుకోలేని షాక్ ఇచ్చింది.అయితే ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన విజయం నమోదైంది. కేవలం ఒకే ఒక్క ఓటుతో తిరుపత్తూరు నియోజకవర్గంలో టీవీకే జెండా ఎగిరిగింది. కౌంటింగ్ కేంద్రంలో నిమిష నిమిషానికి మారిన సమీకరణాలు… ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు చివరకు డీఎంకే మంత్రికి ఊహించని ఓటమిన మిగిల్చింది.

ఒకే ఒక్క ఓటు….

ఈ ఎన్నికల్లో సహకార శాఖ మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ డీఎంకే అభ్యర్థిగా తిరుపత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీవీకే నుంచి శీనివాస సేతుపతి బరిలో నిలవగా…. వీరి మధ్య ఎన్నికల పోరు పోరు నువ్వా-నేనా అన్నట్టు సాగింది. తుది రౌండ్ వరకు ఇద్దరి మధ్య ఆధిక్యం దోబూచులాడింది. చివరకు ఫలితం వెలువడే సమయానికి టీవీకే అభ్యర్థి కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ వార్త వినగానే కౌంటింగ్ కేంద్రం వెలుపల ఉన్న టీవీకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోగా…. డీఎంకే శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి.

అత్యల్ప మెజారిటీ రావడంతో డీఎంకే మంత్రి తరపున ఏజెంట్లు రీకౌంటింగ్ కావాలని పట్టుబట్టారు. దీంతో గంటల తరబడి అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం రీకౌంటింగ్ నిర్వహించినప్పటికీ, ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ ఒక్క ఓటు డీఎంకే మంత్రి రాజకీయ భవిష్యత్తుపై పెద్ద దెబ్బే కొట్టింది. "ప్రజా తీర్పును మేం గౌరవిస్తాం, కానీ ఇంత స్వల్ప తేడాతో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం" అని డీఎంకే సీనియర్ నాయకుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe