Stock market crash : నిమిషాల్లో 8లక్షల కోట్లు ఆవిరి! ఇన్వెస్టర్లను ముంచేస్తున్న ఇరాన్​ యుద్ధం..

Sensex : స్టాక్​ మార్కెట్​లో మరోసారి రక్తపాతం! సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో సెన్సెక్స్​, నిఫ్టీలు భారీగా డౌన్​ అయ్యాయి. నిమిషాల వ్యవధిలో ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 8లక్షల కోట్లు నష్టపోయారు.

Published on: Mar 23, 2026, 09:53:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య యుద్ధం కారణంగా గత 20 రోజులుగా అల్లాడిపోతున్న దేశీయ స్టాక్​ మార్కెట్​ ఇన్వెస్టర్లకు ఇప్పట్లో ఉపశమనం కనిపించేలా లేదు! అనేక రోజులుగా నెల చూపులే చూస్తున్న సూచీలు సోమవారం మరోసారి క్రాష్​ అయ్యాయి. ఓపెనింగ్​లోనే 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్​ 72,977 వద్దకు చేరింది. ఇక నిఫ్టీ50 సైతం 500 మేర పతనమై 22,634 మార్క్​ని హిట్​ చేసింది. బీఎస్​ఈ 150 మిడ్​క్యాప్​, బీఎస్​ఈ 250 స్మాల్​క్యాప్​ సూచీలు 2శాతం కన్నా ఎక్కువ పడ్డాయి.

స్టాక్​ మార్కెట్​ క్రాష్​కి కారణాలేంటి?
స్టాక్​ మార్కెట్​ క్రాష్​కి కారణాలేంటి?

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ మొదలైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు రూ. 8లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. బీఎస్​ఈ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 429 లక్షల కోట్ల నుంచి రూ. 421 లక్షల కోట్లకు పడిపోయింది.

ఇక సోమవారం ఉదయం 9 గంటల 50 నిమిషాల ప్రాంతంలో.. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1418 పాయింట్ల నష్టంతో 73,114 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ50 452 పాయింట్లు పడి 22,662 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్​ నిఫ్టీ 1371 పాయింట్లు పడిపోయి 52,052 వద్ద ట్రేడ్​ అవుతోంది.

సెన్సెక్స్​30లో హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​ మినహా మిగిలిన స్టాక్స్​ అన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్​ ఏకంగా 4.2శాతం, బజాజ్​ ఫైనాన్స్​ 3.03శాతం, అదానీ పోర్ట్స్​ 2.9శాతం క్రాష్​ అయ్యాయి.

దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఎందుకు పడుతున్నాయి?

  1. పశ్చిమాసియాలో అనిశ్చితులు-

ప్రపంచ స్టాక్​ మార్కెట్​ల పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో అనిశ్చితులు. ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రపంచ ముడి చమురు సరఫరాకి జీవనాధారంగా భావించే హర్ముజ్​ జలసంధి చుట్టూ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.

48 గంటల్లో హర్ముజ్​ జలసంధిని పూర్తిగా ఓపెన్​ చేయాలని, లేదా ఇరాన్​ విద్యుత్​ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హెచ్చరించారు. ఆ వార్నింగ్​ని ఇరాన్​ పట్టించుకోలేదు. దాడి చేస్తే, జలసంధిని మొత్తానికే మూసేస్తామని అమెరికాకే వార్నింగ్​ ఇచ్చింది.

2. రూపాయి పతనం-

తాజా అనిశ్చితి కారణంగా రూపాయి సైతం భారీగా పతనమవుతోంది. రోజురోజుకు రికార్డు కనిష్ఠాలకు పడిపోతోంది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో డాలరుతో పోల్చితే రూపాయి విలువ 93.84 వద్ద ఉంది.

రూపాయి ఇలా బలహీనపడుతూ ఉంటే, ఎఫ్​ఐఐల అమ్మకాలు పెరుగుతూ ఉంటాయి.

3. ముడి చమురు ధరలు-

యుద్ధం మొదలైనప్పటి నుంచి ముడి చమురు ధరలు అతి భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు 70 డాలర్ల దిగువన ఉండే బ్రెంట్​ క్రూడ్​ బ్యారెల్​.. ఇప్పుడు ఏకంగా 110 డాలర్ల ఎగువన ట్రేడ్​ అవుతోంది. చమురును అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా ఉండటంతో, దీని ప్రభావం జీడీపీపై ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

4. ఎఫ్​ఐఐల అమ్మకాలు-

యుద్ధం, అనిశ్చితి వంటి పదాలు స్టాక్​ మార్కెట్​లకు నచ్చవు! మరీ ముఖ్యంగా ఎఫ్​ఐఐలకు (ఫారిన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు) ఇవి అస్సలు నచ్చదు. ఇండియాపై చమురు సరఫరా అంతరాయం ప్రభావం, రూపాయి పతనం వంటి కారణాలతో ఎఫ్​ఐఐలు భారత స్టాక్​ మార్కెట్​ల నుంచి భారీ స్థాయిలో డబ్బులను తీసేస్తున్నారు. ఇది స్టాక్​ మార్కెట్​ క్రాష్​కి ఒక కారణం.

యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత స్టాక్​ మార్కెట్​ల నుంచి ఎఫ్​ఐఐలు రూ. 1లక్ష కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసే స్టాక్స్​ని అమ్మేశారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More