బుధవారం నాటి ట్రేడింగ్‌లో బుల్స్ జూలు విదిల్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న బలమైన సంకేతాలతో శ్వేత లోహం వెండి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కిలో ₹3.75 లక్షల మార్కును దాటేసింది. కేవలం ఒక్క రోజులోనే 6% మేర ధర పెరగడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికా డాలర్ విలువ పడిపోవడం, భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా పరిగణించే బంగారం, వెండి వైపు క్యూ కడుతున్నారు.
ఎంసీఎక్స్‌లో ధరల ప్రభంజనం

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు సరికొత్త గరిష్ట స్థాయి ₹3,77,655కు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ సిల్వర్ ఒక దశలో 117.69 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే వెండి ధర ఏకంగా 60% మేర పెరగడం విశేషం.
మరోవైపు బంగారం కూడా రికార్డుల వేటను కొనసాగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 5,200 డాలర్ల మైలురాయిని దాటేసింది. దేశీయ మార్కెట్‌లో (MCX) ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 1.8% పెరిగి 10 గ్రాముల బంగారం ధర ₹1,60,509 వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
వెండి, బంగారం ధరలు ఇంతలా పెరగడానికి ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి:
డాలర్ బలహీనత: అమెరికా డాలర్ విలువ గత నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ బలహీనపడితే, ఇతర కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం, వెండి వంటి కమోడిటీలు చౌకగా మారుతాయి, దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది.
వినియోగదారుల విశ్వాసం తగ్గడం: అమెరికాలో గత 11 ఏళ్లలో లేని విధంగా కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ పడిపోయింది. కార్మిక మార్కెట్ మందగించడం, నిత్యావసరాల ధరలు పెరగడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది.
ఫెడ్ రిజర్వ్ నిర్ణయం: జనవరి పాలసీ సమావేశంలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీనిపై స్పష్టత వచ్చే వరకు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు కొనవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
{{/usCountry}}ఫెడ్ రిజర్వ్ నిర్ణయం: జనవరి పాలసీ సమావేశంలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీనిపై స్పష్టత వచ్చే వరకు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు కొనవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
{{/usCountry}}ధరలు రికార్డు స్థాయిలో ఉన్న సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
“ప్రస్తుతం మార్కెట్‌లో మొమెంటం బలంగా ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఐ (RSI) ఓవర్‌బాట్ జోన్‌లో ఉంది. ఇది మార్కెట్ పడిపోయే సూచనలను (Red Flag) చూపిస్తోంది. బంగారం ₹1,68,790 వద్ద, వెండి ₹3.75 లక్షల నుంచి ₹4.00 లక్షల జోన్‌లో గట్టి నిరోధాన్ని (Resistance) ఎదుర్కోవచ్చు” అని ఛాయిస్ బ్రోకింగ్ నిపుణుడు ఆమీర్ మక్దా విశ్లేషించారు.
మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ రవి సింగ్ స్పందిస్తూ..
“బంగారం, వెండిని కేవలం లాభాలు ఆర్జించే సాధనాలుగా కాకుండా, రిస్క్ మేనేజ్మెంట్, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం మాత్రమే వాడుకోవాలి. ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో దూకుడుగా వెళ్లకుండా, అప్పుడప్పుడు లాభాలను స్వీకరించడం మేలు” అని సూచించారు.
ప్లాటినం, పల్లాడియం వంటి ఇతర విలువైన లోహాలు కూడా నేడు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ప్లాటినం స్పాట్ ధర 1.5% పెరిగి 2,679 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
(గమనిక: పైన పేర్కొన్న అభిప్రాయాలు, సూచనలు ఆయా నిపుణులు లేదా బ్రోకింగ్ సంస్థల వ్యక్తిగతమైనవి. పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము.)