...
...
Next Story

Skoda Kushaq బేస్​ వేరియంట్​లోనే సన్​రూఫ్​, ఆటోమేటిక్​ గేర్​బాక్స్​- ధర కూడా తక్కువే!

స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ తన కొత్త వేరియంట్లతో ఎంట్రీ లెవల్ కార్ల విలువను అమాంతం పెంచేసింది! ముఖ్యంగా 'క్లాసిక్ ప్లస్' అనేది బేస్ వేరియంట్ అయినప్పటికీ, ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను ఆశ్చర్యపరుస్తోంది. రూ. 11-12 లక్షల అంచనా ధరతో వస్తున్న ఈ ఎస్​యూవీ పూర్తి విశేషాలు మీకోసం..

Published on: Jan 27, 2026 10:45 AM IST
Advertisement

స్కోడా ఇండియా తన పాపులర్ మోడల్ 'కుషాక్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా ఎస్​యూవీ వేరియంట్ల సంఖ్యను పెంచడమే కాకుండా, ఎంట్రీ లెవల్ వేరియంట్ కస్టమర్లకు భారీ విలువను చేకూర్చింది. ముఖ్యంగా దీని బేస్ వేరియంట్ ‘క్లాసిక్ ప్లస్’ని.. తక్కువ ధరలో కూడా అన్ని ముఖ్యమైన ఫీచర్లను అందించడమే లక్ష్యంగా తయారు చేశారు. ఈ నేపథ్యంలో స్కోడా కుషాక్​ బేస్​ వేరియంట్​ ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్కోడా కుషాక్ ఫేస్​లిఫ్ట్​​ బేస్​ వేరియంట్​- కీలక విషయాలు..

స్కోడా కుషాక్​ బేస్​ వేరియంట్​..
స్కోడా కుషాక్​ బేస్​ వేరియంట్​..

1. ఇంజిన్, గేర్‌బాక్స్: ఆటోమేటిక్ కూడా అందుబాటులో..

కుషాక్ క్లాసిక్ ప్లస్ వేరియంట్ కేవలం 1.0 లీటర్ టీఎస్‌ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది 113 బీహెచ్​పీ పవర్, 178 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధాన ఆకర్షణ గేర్‌బాక్స్ ఆప్షన్లు! కస్టమర్లు ఇందులో 6-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. సాధారణంగా మిడ్​, టాప్ ఎండ్ కార్లకే పరిమితమయ్యే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఇప్పుడు బేస్ మోడల్ నుండే అందుబాటులోకి రావడం విశేషం.

2. ఎక్స్‌టీరియర్: బేస్ మోడల్‌లోనూ ప్రీమియం లుక్..

స్కోడా కుషాక్​ ఫేస్​లిఫ్ట్​లో ఇది ఎంట్రీ లెవల్ అయినప్పటికీ, ఎక్కడా కూడా సాదాసీదా మోడల్‌లా కనిపించదు! ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, టెయిల్-ల్యాంప్స్, వెనుక వైపు సెక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లను ప్రామాణికంగా ఇచ్చారు. అంతేకాకుండా, 16-ఇంచ్​ అలాయ్ వీల్స్‌ను కూడా బేస్ వేరియంట్ నుండే అందిస్తున్నారు. దీనివల్ల కుషాక్ బేస్​ వేరియంట్​ కూడా చూడటానికి టాప్ వేరియంట్ల మాదిరిగానే ఖరీదైనదిగా కనిపిస్తుంది. అయితే, టాప్ మోడల్స్‌లో ఉండే ఫ్రంట్ గ్రిల్ ఎల్‌ఈడీ లైట్ బార్ మాత్రం ఇందులో ఉండదు.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. స్కోడా కుషాక్​ క్లాసిక్ ప్లస్ వేరియంట్ 6.9-ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్వాలిటీ స్పీకర్లతో వస్తుంది. దీనికి తోడు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. ప్రయాణికుల సౌకర్యం కోసం రెయిన్ సెన్సింగ్ వైపర్లు, రియర్ వైపర్, డీఫాగర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎం వంటి ఫీచర్లను చేర్చారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ బేస్ మోడల్‌లో ఎలక్ట్రిక్ సింగిల్-పేన్ సన్‌రూఫ్ కూడా ఉంది! టాప్ వేరియంట్లలో డ్యూయల్-పేన్ సన్‌రూఫ్ ఉండగా, బేస్ మోడల్‌లో ఈ ఫీచర్ ఇవ్వడం కస్టమర్లకు పెద్ద ప్లస్ పాయింట్.

4. భద్రత: రాజీ లేని రక్షణ..

స్కోడా తన బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ ఎస్​యూవీ క్లాసిక్ ప్లస్ వేరియంట్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించారు. వీటితో పాటు 25కు పైగా యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గ్లోబల్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్‌లో పొందిన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఈ శ్రేణిలోని అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. నగరాల్లో డ్రైవింగ్ సులభం చేయడానికి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను కూడా ఆప్షనల్‌గా పొందే వీలుంది.

5. ధర, వ్యాల్యూ ప్రపోజిషన్..

స్కోడా ఇంకా అధికారిక ధరలను ప్రకటించనప్పటికీ, కుషాక్ క్లాసిక్ ప్లస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ లైటింగ్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉండటం వల్ల, ఈ బేస్ వేరియంట్ తన ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ కస్టమర్లకు సరైన ఎంపికగా మారనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe