Skoda Peaq : స్కోడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఎస్​యూవీ- ‘ పీక్’ పేరుతో స్టైలిష్ ఫ్లాగ్​షిప్​ ఈవీ..

Skoda Peaq price : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో తన అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘పీక్’ ఎక్స్​టీరియర్ డిజైన్ స్కెచ్‌లను అధికారికంగా విడుదల చేసింది. 3-వరుసల సీటింగ్ సామర్థ్యంతో వస్తున్న ఈ ఈవీ జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయనుంది. వివరాలలోకి వెళితే..

Published on: Jun 5, 2026, 05:58:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Skoda Peaq India launch : గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్​లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ తన రాబోయే సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘స్కోడా పీక్’కు సంబంధించిన మొదటి అధికారిక ఎక్స్‌టీరియర్ డిజైన్ స్కెచ్‌లను విడుదల చేసింది. మూడు వరుసల సీటింగ్ ఆప్షన్‌తో వస్తున్న ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ నెల జూన్ 23, 2026న ఫ్రాన్స్‌లోని మొన్నెటియర్-మోర్నెక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా ప్రదర్శితం కానుంది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో స్కోడా బ్రాండ్ భవిష్యత్తు డిజైన్ శైలిని, సాంకేతికతను ఈ కారు ప్రతిబింబించనుంది.

స్కోడా పీక్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఇదిగో..
స్కోడా పీక్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఇదిగో..

స్కోడా పీక్- మోడ్రన్ సాలిడ్ డిజైన్ ఫిలాసఫీ

స్కోడా పీక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ సరికొత్త ‘మోడ్రన్ సాలిడ్’ డిజైన్ లాంగ్వేజ్‌ ఆధారంగా రూపొందించింది. క్లీన్ సర్ఫేసెస్, షార్ప్ డీటెయిలింగ్, పక్కా కొలతలతో కూడిన బాడీ ప్రొఫైల్‌పై ఈ డిజైన్ ఫోకస్ చేస్తుంది. కంపెనీ విడుదల చేసిన ప్రాథమిక స్కెచ్‌లను పరిశీలిస్తే, ఈ కారు మినిమలిస్టిక్ లుక్‌తో పాటు చాలా పవర్‌ఫుల్ విజువల్ ఐడెంటిటీని కలిగి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఫ్రంట్ లుక్, ‘టెక్-డెక్ ఫేస్’..

ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో చాలా సన్నని టీ-షేప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లను అమర్చారు. వీటి మధ్యలో గ్లోస్-బ్లాక్ ప్యానెల్‌ను అందించారు. దీనిని స్కోడా కంపెనీ ‘టెక్-డెక్ ఫేస్’గా పిలుస్తోంది. ఈ రెండు హెడ్‌లైట్లను కలుపుతూ ఒక కనెక్టింగ్ లైట్ ఎలిమెంట్ ఉంటుంది. ఇది కారుకు ఒక లూప్ లాంటి విజువల్ సిగ్నేచర్‌ను ఇస్తుంది. కింది బంపర్ భాగం ‘వోల్కనో-షేప్’ డిజైన్‌ను పోలి ఉండి, స్పష్టమైన హారిజాంటల్ లైన్లతో కారుకు ఒక అగ్రెసివ్, కాంట్రాస్ట్ లుక్‌ను జోడిస్తుంది.

సైడ్, రేర్ ప్రొఫైల్ విశేషాలు..

పక్క నుంచి చూసినప్పుడు స్కోడా పీక్ ఈవీ చాలా గంభీరంగా, పొడవుగా కనిపిస్తుంది. దీని హై షోల్డర్ లైన్, వెడల్పైన డీ-పిల్లర్లు ఇది ఒక పక్కా 3-వరుసల పెద్ద ఎస్‌యూవీ అని చెప్పకనే చెబుతాయి. ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని పెంచడానికి, కారుకు క్లీన్ ప్రొఫైల్ ఇవ్వడానికి బాడీతో కలిసిపోయే ‘ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్’ ను ఇందులో ఉపయోగించారు. కారు వెనుక భాగంలో కూడా ముందు వైపు ఉన్నట్లే టీ-షేప్ టెయిల్ ల్యాంప్స్, వాటిని కలుపుతూ లైట్ బార్‌ను ఇచ్చారు. ఈ సిగ్నేచర్ లైటింగ్ వల్ల స్కోడా పీక్ కారు పగటిపూట అయినా, రాత్రి వేళ అయినా రోడ్డుపై చాలా సులభంగా గుర్తింపు పొందుతుంది.

టాప్ లైన్ ఫ్లాగ్‌షిప్ మోడల్..

స్కోడా పీక్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీని మోడ్రన్ సాలిడ్ ఫిలాసఫీని పూర్తిగా అప్లై చేస్తూ డెవలప్ చేశామని స్కోడా ఆటో ఎక్స్‌టీరియర్ డిజైన్ హెడ్ కార్ల్ నైహోల్డ్ తెలిపారు. స్కోడా గ్లోబల్ లైనప్‌లోనే ఇది అత్యంత ఖరీదైన, ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలవనుంది. ప్రస్తుతానికి ఈ ఈవీ టెక్నికల్ స్పెసిఫికేషన్లు, బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్ లేదా ఇంటీరియర్ ఫీచర్ల వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, స్కోడా గ్లోబల్ ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో ఈ మోడల్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More