8 స్పీడ్ గేర్‌బాక్స్, జెమినీ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో Skoda Slavia facelift లాంచ్- ధర..
స్కోడా ఇండియా సరికొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రూ. 10 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ కారులో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, జెమినీ ఏఐ వాయిస్ అసిస్టెంట్, వెనుక సీట్లకు మసాజ్ ఫంక్షన్ వంటి అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే
భారత ఆటోమొబైల్ మార్కెట్లో సెడాన్ ప్రియులను ఆకట్టుకునేలా స్కోడా ఇండియా సరికొత్త ‘స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ నయా మోడల్ ప్రారంభ ధరను రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 18.84 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. రీఫ్రెష్డ్ స్టైలింగ్, అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు, సుఖవంతమైన క్యాబిన్‌తో రూపుదిద్దుకున్న ఈ కారు కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వచ్చే వారం నుంచే కస్టమర్లకు డెలివరీలు ప్రారంభించనున్నట్లు స్కోడా ప్రతినిధులు వెల్లడించారు.

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- వేరియంట్లు, ఆకర్షణీయమైన రంగులు..
సరికొత్త స్కోడా స్లావియా 2026 మోడల్ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. క్లాసిక్, క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మోంటే కార్లో ఆప్షన్లలో దీనిని ఎంచుకోవచ్చు.
క్యాండీ వైట్, కార్బన్ స్టీల్, బ్రిలియంట్ సిల్వర్, లావా బ్లూ, డీప్ బ్లాక్, చెర్రీ రెడ్, షిమ్లా గ్రీన్, స్టీల్ గ్రే వంటి రంగులతో పాటు ఆర్కిటిక్ సిల్వర్, క్యాపుచినో బీజ్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లను ఈ సెడాన్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో క్యాపుచినో బీజ్ వేరియంట్ డెలివరీలు 2026 డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తాయి. ఎంక్యూబీ-ఏ0-ఇన్ ప్లాట్‌ఫారమ్‌పై తయారైన ఈ కారు హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, ఫోక్స్‌వాగన్ వర్టస్ వంటి పాపులర్ సెడాన్లకు మార్కెట్లో ప్రత్యక్ష పోటీనిస్తుంది.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- అత్యాధునిక ఎక్స్‌టీరియర్ లుక్..
ఈ స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వెలుపలి రూపురేఖల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. కొత్తగా డిజైన్ చేసిన ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎల్‌ఈడీ టెయిల్‌లాంప్‌లను జతచేశారు. ముందు భాగంలో ఉన్న గ్రిల్‌పై హారిజాంటల్ క్రోమ్ స్ట్రిప్‌ను అమర్చారు. నూతన డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ లుక్ ఇస్తాయి. మోంటే కార్లో వేరియంట్‌లో నల్లటి ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్, ఎరుపు రంగు డిటైలింగ్, ప్రత్యేకమైన మోంటే కార్లో బ్యాడ్జింగ్ ఇచ్చి మరింత ప్రీమియమ్‌గా తీర్చిదిద్దారు.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- హైటెక్ క్యాబిన్.. సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు
క్యాబిన్ లోపల టెక్నాలజీకి పెద్దపీట వేశారు. హయ్యర్ వేరియంట్లలో 25.6 సెంటీమీటర్ల రీడిజైన్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో పాటు టాప్ వేరియంట్లలో 26.03 సెంటీమీటర్ల డిజిటల్ కాక్‌పిట్‌ను అందించారు. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. గూగుల్ క్లౌడ్ ఆటోమోటివ్ ఏఐ ఏజెంట్, జెమినీ ఇంటిగ్రేషన్‌తో పనిచేసే ఏఐ-పవర్డ్ వాయిస్ అసిస్టెంట్‌ను ఇందులో చేర్చడం విశేషం.
ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా వెనుక సీట్లలో మసాజ్ ఫంక్షన్ సౌకర్యాన్ని అందించారు. ఈ ఫీచర్ ప్రెస్టీజ్, మోంటే కార్లో వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. వీటితో పాటు ముందు సీట్లకు వెంటిలేషన్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్, 360-డిగ్రీ ఏరియా వ్యూ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లతో కూడిన పార్క్ పైలట్ వంటి సదుపాయాలు ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా మారుస్తాయి.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు..
ఇంజిన్ పనితీరు విషయంలో స్లావియా 1.0-లీటర్ టీఎస్ఐ, 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను కొనసాగించింది. 1.0 టీఎస్ఐ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, సెగ్మెంట్‌లోనే తొలిసారిగా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పొందింది. అధిక శక్తినిచ్చే 1.5 టీఎస్ఐ ఇంజిన్ 7-స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది ప్రెస్టీజ్ వేరియంట్ నుంచి కస్టమర్లకు లభ్యమవుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


