భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ సెడాన్ల విభాగంలో మంచి ఆదరణ పొందిన స్కోడా స్లావియా.. సరికొత్త రూపంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 18న స్లావియా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లాంచ్ చేసేందుకు స్కోడా ఆటో ఇండియా ఏర్పాట్లు పూర్తి చేసింది.

స్టైలిష్ డిజైన్, అదనపు ఫీచర్లు, ముఖ్యంగా ఇంజిన్‌లో సరికొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మార్పుతో రాబోతున్న ఈ కారు, మార్కెట్లో ఉన్న వోక్స్‌వాగన్ వర్టస్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి పోటీ కార్లకు గట్టి సవాలు విసరనుంది.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- ఎక్స్టీరియర్..
టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై షాట్ల ఆధారంగా, కొత్త స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వెహికల్ డిజైన్‌లో పలు ఆసక్తికరమైన మార్పులు జరిగాయి:
ముందు భాగం: అప్‌డేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, స్కోడా కొత్త కుషాక్, కొడియాక్ మోడళ్ల తరహాలోనే ఇంటిగ్రేటెడ్ లైటింగ్‌తో కూడిన రీడిజైన్డ్ గ్రిల్ కొలువుదీరనుంది. ఫ్రంట్ బంపర్‌ను కూడా మరింత స్పోర్టీగా తీర్చిదిద్దారు.
వెనుక భాగం: వెనుక వైపు సరికొత్త ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్‌తో పాటు నయా డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్‌ను అందించనున్నారు.
లోపల సరికొత్త లగ్జరీ ఫీచర్లుక్యాబిన్ డాష్‌బోర్డ్ లేఅవుట్ మార్పులేకుండానే కొనసాగినప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త సాంకేతికతను జోడించారు:
డిజిటల్ అనుభూతి కోసం 10.25-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మెరుగైన సీట్ అప్‌హోల్‌స్టరీ, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో పరిచయం చేసినట్లే, స్లావియాలోనూ వెనుక సీట్ల ప్రయాణికులకు ‘మసాజ్ ఫంక్షన్’ ఫీచర్‌ను అందించే అవకాశముంది.
వీటితో పాటు 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, 8-స్పికర్ ఆడియో సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు యథాతథంగా లభిస్తాయి.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- సరికొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్..
ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత కీలకమైన మార్పు ఇంజిన్ విభాగంలో జరిగింది:
{{/usCountry}}ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత కీలకమైన మార్పు ఇంజిన్ విభాగంలో జరిగింది:
{{/usCountry}}1.0-లీటర్ టీఎస్ఐ టర్బో-పెట్రోల్ (115 హెచ్‌పీ): ఇప్పటివరకు ఉన్న 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ స్థానంలో సరికొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది మరింత స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.
1.5-లీటర్ టీఎస్ఐ టర్బో-పెట్రోల్ (150 హెచ్‌పీ): ఈ పవర్‌ఫుల్ ఇంజిన్ యథావిధిగా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) గేర్‌బాక్స్‌తోనే రానుంది. రెండు ఇంజిన్ వేరియంట్లలోనూ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్- అంచనా ధర, పోటీ..
అదనపు ఫీచర్లు, అప్‌డేటెడ్ గేర్‌బాక్స్ కారణాల వల్ల కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్ ధర ప్రస్తుత మోడల్ కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో స్లావియా ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 18.19 లక్షల మధ్య ఉంది. ఆగస్టు 18న గ్రాండ్‌గా లాంచ్ అయిన తర్వాత ఇది ఇండియన్ సెడాన్ మార్కెట్లో మరింత రసవత్తరమైన పోటీని సృష్టించనుంది.