భారతదేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది! దేశీయ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి సరికొత్త రెక్కలు తొడుగుతూ.. ప్రముఖ స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి మధ్యాహ్నం 12:05 గంటలకు ఈ చారిత్రాత్మక ప్రయోగం జరిగింది.
'మిషన్ ఆగమన్' పేరుతో చేపట్టిన ఈ తొలి ఆర్బిటల్ టెస్ట్ ఫ్లైట్, భారతీయ ప్రైవేట్ రంగాన్ని అంతర్జాతీయ శాటిలైట్ లాంచ్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మొదటి అడుగుగా నిలిచింది. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ స్మృత్యర్థం ఈ రాకెట్‌కు 'విక్రమ్' అని పేరు పెట్టడం విశేషం.
వాస్తవానికి తొలుత ఉదయం 11:30 నిమిషాలకు విక్రమ్-1 టేకాఫ్ జరగాల్సి ఉంది. చివరి నిమిషంలో వాయిదా పడింది. మళ్లీ టేకాఫ్ ఎప్పుడు ఉంటుంది? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సమయంలో.. కాస్త ఆలస్యంగా, మధ్యాహ్నం 12:30కి విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లింది.
భారత అంతరిక్ష రంగంలో 10 సరికొత్త రికార్డులను ఈ ఒక్క ప్రయోగం సృష్టించనుంది. ఆ చారిత్రాత్మక మైలురాళ్లు ఇవే:
1. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్..
ఇప్పటివరకు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే ప్రయోగాలన్నీ ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో నేతృత్వంలోనే జరిగాయి. కానీ, విక్రమ్-1 రాకెట్ ప్రయోగంతో భారత్‌లో పరిశ్రమల నేతృత్వంలోని అంతరిక్ష మిషన్ల యుగం అధికారికంగా ప్రారంభమైంది. ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చడానికి ఒక ప్రైవేట్ సంస్థ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన మొదటి రాకెట్ ఇదే.
2. అంతరిక్ష కక్ష్యను చేరడమే లక్ష్యంగా తొలి ఇండియన్ స్టార్టప్ ప్రయోగం!
హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు ఇది మొట్టమొదటి ఆర్బిటల్ టెస్ట్ ఫ్లైట్. గతంలో సబ్-ఆర్బిటల్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఈ స్టార్టప్, ఇప్పుడు నేరుగా భూకక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు ఒక భారతీయ ప్రైవేట్ సంస్థ చేస్తున్న తొలి అద్భుత ప్రయత్నం ఇదే.
3. పూర్తి కార్బన్ కంపోజిట్ నిర్మాణంతో తయారైన తొలి రాకెట్..
{{/usCountry}}హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు ఇది మొట్టమొదటి ఆర్బిటల్ టెస్ట్ ఫ్లైట్. గతంలో సబ్-ఆర్బిటల్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఈ స్టార్టప్, ఇప్పుడు నేరుగా భూకక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు ఒక భారతీయ ప్రైవేట్ సంస్థ చేస్తున్న తొలి అద్భుత ప్రయత్నం ఇదే.
3. పూర్తి కార్బన్ కంపోజిట్ నిర్మాణంతో తయారైన తొలి రాకెట్..
{{/usCountry}}సాధారణంగా రాకెట్ల తయారీలో ఉపయోగించే సాంప్రదాయ స్టీల్ లేదా మెటల్స్ కాకుండా, విక్రమ్-1 రాకెట్ బాడీ మొత్తాన్ని ‘ఆల్-కార్బన్ కంపోజిట్’ స్ట్రక్చర్‌తో నిర్మించారు. ఇది స్టీల్ కంటే ఎంతో తేలికగా ఉంటూనే, అత్యంత బలమైన శక్తిని ఇస్తుంది. దీనివల్ల రాకెట్ పనితీరు, ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరుగుతాయి.
4. ఆర్బిటల్ వెహికల్‌లో 100% త్రీడీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్..
విక్రమ్-1 రాకెట్‌లోని ‘ఆర్బిటల్ అడ్జస్ట్‌మెంట్ మోడ్యూల్’లో పూర్తిగా త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో తయారు చేసిన లిక్విడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. భారత అంతరిక్ష ప్రయోగ చరిత్రలో ఒక ఆర్బిటల్ లాంచ్ వెహికల్‌లో ఇలాంటి త్రీడీ ప్రింటెడ్ ఇంజన్ వాడటం ఇదే మొదటిసారి.
5. అత్యంత పొడవైన మోనోలిథిక్ కార్బన్ కంపోజిట్ రాకెట్ స్టేజ్..
ఈ రాకెట్ మొదటి దశ.. దేశంలోనే అత్యంత పొడవైన మోనోలిథిక్ కార్బన్ కంపోజిట్ రాకెట్ స్టేజ్‌గా రికార్డు సృష్టించింది. ఇది అంతరిక్ష రంగంలో భారతదేశ స్వదేశీ తయారీ సామర్థ్యానికి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది.
6. సరికొత్త అల్ట్రా-లో-షాక్ న్యూమాటిక్ సెపరేషన్ సిస్టమ్..
రాకెట్ ప్రయాణంలో వివిధ దశలు, పేలోడ్ ఫేరింగ్స్ విడిపోయే సమయంలో ఎలాంటి కుదుపులు లేకుండా ఉండేందుకు విక్రమ్-1లో అడ్వాన్స్‌డ్ న్యూమాటిక్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. మనదేశ లాంచ్ వెహికల్ ఎకోసిస్టమ్‌లో ఇలాంటి సరికొత్త టెక్నాలజీని ఉపయోగించడం ఇదే తొలిసారి.
7. అంతరిక్ష వ్యర్థాల తొలగింపు ప్రదర్శన..
విక్రమ్-1 మోసుకెళ్తున్న పేలోడ్స్‌లో అత్యంత కీలకమైంది 'ఎంబ్రేస్' (EMBRACE) మిషన్. అంతరిక్షంలో ప్రమాదకరంగా మారుతున్న శకలాలు, వ్యర్థాలను తొలగించడానికి భవిష్యత్తులో ఉపయోగపడే రోబోటిక్ ఆర్మ్ సాంకేతికతను ఈ ప్రయోగం ద్వారా పరీక్షించనున్నారు. ఒక ప్రైవేట్ రాకెట్ ద్వారా ఈ తరహా ప్రయోగం జరగడం దేశంలోనే ప్రథమం.
8. సైన్స్ దిగ్గజాలకు 'మైక్రో ఆర్ట్' ద్వారా ఘన నివాళి!
ఈ మిషన్‌లో ఒక ప్రత్యేకమైన మైక్రో ఆర్ట్ ట్రిబ్యూట్ని కూడా అంతరిక్షంలోకి పంపుతున్నారు. 18 క్యారెట్ల బంగారంతో చేసిన ఒక సూక్ష్మ రాకెట్‌లో భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాల మూలస్తంభాలైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్, సర్ సీవీ రామన్, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ విగ్రహాలను ఉంచారు. ఇది సైన్స్, జాతీయ వారసత్వాల అద్భుత కలయిక.
9. అంతరిక్షంలోకి ల్యాబ్-గ్రోన్ డైమండ్!
కళాత్మక ప్రదర్శనలో భాగంగా, ల్యాబ్‌లో కృత్రిమంగా తయారు చేసిన 'కాస్మిక్ బ్లూమ్' అనే వజ్రాన్ని ఈ రాకెట్ ద్వారా అంతరిక్ష కక్ష్యలోకి పంపుతున్నారు. వ్యాపారపరమైన అంతరిక్ష ప్రయోగాలకు సృజనాత్మకతను జోడించవచ్చని ఈ మిషన్ నిరూపిస్తోంది.
10. ప్రధాని మోదీ దేశభక్తి సందేశం అంతరిక్షంలోకి..
'మిషన్ ఆగమన్' ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన శుభాకాంక్షల సందేశాన్ని రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్తోంది. 'వందేమాతరం' అనే నినాదంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది మంది మద్దతుదారుల అభినందనల కార్డును కూడా ఈ రాకెట్ మోసుకెళ్లనుంది. ఇది భారతదేశ విస్తరిస్తున్న అంతరిక్ష ఆకాంక్షలను దేశ పౌరుల ఆశయాలతో అనుసంధానించేలా ప్రదర్శించనున్నారు.
సుమారు 7 అంతస్తుల ఎత్తు ఉండే ఈ విక్రమ్-1 రాకెట్, దాదాపు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తక్కువ భూకక్ష్యలోకి చేర్చగలదు. దాదాపు 1000 మంది సిబ్బంది నిరంతర శ్రమ, 400 మందికి పైగా సప్లయర్ల భాగస్వామ్యం, 3000 రోజుల కఠోర దీక్షకు ఈ ప్రయోగమే పరాకాష్ట అని స్కైరూట్ కో-ఫౌండర్ నాగ భరత్ డాకా సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ప్రయోగంతో గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది.