...
...
Next Story

Range Rover : SRH స్టార్ నితీష్ గ్యారేజీలోకి రేంజ్ రోవర్- కోట్లు విలువైన లగ్జరీ కారు హైలైట్స్​ ఇవే..

Range Rover Autobiography : ఎస్​ఆర్​హెచ్​ కీలక ఆటగాడు నితీశ్​ కుమార్ రెడ్డి కొత్తగా ఒక లగ్జరీ కారును తన గ్యారేజ్​లో యాడ్​ చేసుకున్నాడు. సెలబ్రిటీలు కొనుగోలు చేసే ఈ ఎస్​యూవీ ఇప్పుడు నితీశ్​ సొంతం. ఈ మోడల్ ధర, విశేషాలు..

Published on: Apr 21, 2026, 13:16:45 IST
Advertisement

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్​ఆర్​హెచ్) తరపున అదరగొడుతున్న యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి.. తన కలల కారును సొంతం చేసుకున్నాడు. విలాసవంతమైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లగ్జరీ కారును కొనుగోలు చేసిన సెలబ్రిటీల జాబితాలో చేరాడు.

బాటుమీ గోల్డ్ ఫినిష్‌లో మెరిసిపోతున్న కారు..

నితీష్ గ్యారేజీలోకి రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ..
నితీష్ గ్యారేజీలోకి రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ..

నితీష్ రెడ్డి కొనుగోలు చేసిన ఈ లగ్జరీ ఎస్‌యూవీ ‘బాటుమీ గోల్డ్’ రంగులో మెరిసిపోతోంది. షోరూమ్ నుంచి కారు డెలివరీ తీసుకుంటున్న సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సందడి చేశాడు.

ఈ కారు కొనుగోలుతో సంజయ్ దత్, శిల్పా శెట్టి, రణదీప్ హుడా, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజాల సరసన నితీష్ నిలిచాడు.

ఏప్రిల్ 18న చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ సాధించిన ఉత్కంఠ విజయంలో నితీష్ రెడ్డి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ విజయం తర్వాతి రోజే ఈ కొత్త కారు ఇంటికి చేరడం విశేషం.

ఈ కారు ప్రత్యేకతలేంటి?

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ అనేది లగ్జరీ, పవర్ కలయిక.

ఇంజన్: ఇందులో 4.4 లీటర్ వీ8 ఇంజన్ ఉంది. ఇది 522 హెచ్​పీ పవర్​ని, 750 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వేగం: ఈ భారీ ఎస్‌యూవీ కేవలం 4.6 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు.

ఇంటీరియర్: కారు లోపల మసాజ్ ఫంక్షన్లు ఉన్న పవర్ అడ్జస్టబుల్ సీట్లు ఉన్నాయి. లాంగ్ జర్నీలో కూడా అలసట తెలియకుండా ఉండేలా వీటిని రూపొందించారు.

ఈ లగ్జరీ కారులో భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. 360-డిగ్రీ కెమెరా, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డీఎస్​సీ), మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) వంటి ఫీచర్లు ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పిస్తాయి.

ప్రస్తుతం మార్కెట్​లో ఈ రేంజ్​ రోవర్​ ఆటోబయోగ్రఫి ప్రారంభ ఎక్స్​షోరూం ధరే రూ. 2.31కోట్లుగా ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. నితీష్ కుమార్ రెడ్డి కొనుగోలు చేసిన కారు ధర ఎంత?

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ధర వేరియంట్‌ను బట్టి సుమారు రూ. 2.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది. ఇది అత్యంత విలాసవంతమైన మోడళ్లలో ఒకటి.

2. నితీష్ రెడ్డి ఈ కారును ఏ రంగులో ఎంచుకున్నారు?

ఆయన 'బాటుమీ గోల్డ్' (Batumi Gold) అనే ప్రత్యేకమైన రంగును ఎంచుకున్నారు. ఇది కారుకు మరింత క్లాసిక్, రిచ్ లుక్ ఇస్తుంది.

3. ఐపీఎల్ 2026లో నితీష్ రెడ్డి ప్రదర్శన ఎలా ఉంది?

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నితీష్ ఒక కీలక ఆల్ రౌండర్‌గా ఎదిగారు. ముఖ్యంగా చెన్నైతో జరిగిన మ్యాచులో తక్కువ పరుగులు ఇచ్చి వికెట్లు తీయడం ద్వారా జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks