...
...
Next Story

Starlink India : ఇండియాలో స్టార్​లింక్​- నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ధరలు ఇలా..

ఇండియాలో కార్యకలాపాలను ప్రారంభించే ముందు స్టార్‌లింక్ సంస్థ తమ సబ్​స్క్రిప్షన్​ ధరలను ప్రకటించింది. వీటితో పాటు కొన్ని ఫీచర్స్​ని కూడా వెల్లడించింది. మరోవైపు లింక్​డిన్​లో ఉద్యోగాల ఓపెనింగ్స్​ని కూడా పోస్ట్​ చేసింది. వివరాల్లోకి వెళితే..

Published on: Dec 8, 2025, 12:20:06 IST
Advertisement

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్​కి చెందిన అనుబంధ సంస్థ స్టార్‌లింక్.. భారతదేశంలో తన నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలను వెల్లడించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ శాటిలైట్​ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్.. నివాస వినియోగదారుల కోసం తమ ప్లాన్‌లో ఉన్న కీలక విషయాలను కూడా ప్రకటించింది.

ఇండియాలో స్టార్​లింక్​ సబ్​స్క్రిప్షన్​ ధరలు ఇలా..
ఇండియాలో స్టార్​లింక్​ సబ్​స్క్రిప్షన్​ ధరలు ఇలా..

భారతదేశంలో కార్యకలాపాలను విస్తరించడానికి ఈ కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు నివేదికలు వెలువడిన కొద్దిరోజలకు, స్టార్‌లింక్ బెంగళూరు కార్యాలయం కోసం లింక్‌డిన్​లో ఇటీవలే నాలుగు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇచ్చింది.

స్టార్​లింక్​ ఇండియా- నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర, ముఖ్య ఫీచర్లు..

శాట్​కామ్​ కంపెనీ స్టార్‌లింక్ తమ భారతీయ వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసింది. నివాస వినియోగదారుల కోసం సబ్‌స్క్రిప్షన్ ధరలను ఇందులో పేర్కొంది:

నెలవారీ ధర: స్టార్‌లింక్ శాటిలైట్​ ఇంటర్నెట్ సర్వీస్​ కోసం స్పేస్‌ఎక్స్ నెలకు రూ. 8,600 వసూలు చేస్తుంది.

హార్డ్‌వేర్ ఖర్చు: ఈ ధరలో రూ. 34,000 విలువైన హార్డ్‌వేర్ ఖర్చు కూడా కలిసి ఉంటుంది.

కీలక ఫీచర్లు: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ టెక్ సంస్థ అపరిమిత డేటాతో పాటు 30 రోజుల ట్రయల్​ను అందిస్తుంది.

స్టార్‌లింక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ సర్వీస్​ "అన్ని వాతావరణాల్లోనూ పనిచేస్తాయి", 99.9 శాతం కంటే ఎక్కువ అప్‌టైమ్ లేదా అంతరాయం లేని ఇంటర్నెట్ కనెక్షన్‌ను వినియోగదారులు పొందొచ్చు. అంతేకాకుండా, యూజర్లు "ప్లగ్- ఇన్ చేసి వెంటనే ఉపయోగించడం" ప్రారంభించవచ్చు.

గత అక్టోబర్ చివరిలో, స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ బెంగళూరు కార్యాలయం కోసం లింక్‌డిన్ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో నాలుగు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇచ్చింది. ఆ సమయంలో, పేమెంట్స్ మేనేజర్, అకౌంటింగ్ మేనేజర్, సీనియర్ ట్రెజరీ అనలిస్ట్, ట్యాక్స్ మేనేజర్ వంటి పోస్టుల కోసం కంపెనీ నియామకాలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను అందించడానికి స్టార్‌లింక్ చేస్తున్న "అంతర్జాతీయ విస్తరణ ప్రయత్నాల్లో" ఈ నియామకాలు భాగమని ఉద్యోగ ప్రకటనల్లో పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా గ్రౌండ్ స్టేషన్ల ఏర్పాటు..

స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ అయిన స్టార్‌లింక్ భారతదేశంలో బహుళ ప్రాంతాల్లో తమ గేట్‌వే ఎర్త్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రదేశాల్లో చండీగఢ్, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై, నోయిడా వంటి నగరాలు ఉన్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks