ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆకాశాన్ని తాకిన ముడి చమురు ధరల కారణంగా.. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం నెలకొంది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లోనూ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ సూచీలు అతి భారీ నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1862 పాయింట్లు పడి 77,057 వద్ద ఓపెన్ అయ్యింది. నిఫ్టీ50 ఏకంగా 582 పాయింట్లు కోల్పోయి 23,868 వద్ద సెషన్‌ని ప్రారంభించింది. ఇక 1662 పాయింట్లు పడిన బ్యాంక్ నిఫ్టీ 56,121 వద్ద సెషన్‌ని మొదలుపెట్టింది.

దేశీయ సూచీల పతనం కేవలం ఓపెన్‌తో ముగియలేదు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లు మరింత వేగంగా కిందకు స్లైడ్ అయ్యాయి. ఉదయం 9 గంటల 20 నిమిషాలకు సెన్సెక్స్ 2,130 పాయింట్లు, నిఫ్టీ 651 పాయింట్ల మేర డౌన్ అయ్యాయి.
సెన్సెక్స్30లో అన్ని స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో ఏకంగా 6శాతం, టాటా స్టీల్ 5.4శాతం, ఎల్ అండ్ టీ 4,9శాతం మేర పడ్డాయి.
స్టాక్ మార్కెట్ ఎందుకు క్రాష్ అవుతోంది? ఇవీ కారణాలు..
- ముడి చమురు ధర 115 డాలర్లకు పైనే..
పశ్చిమాసియా అలజడుల నేపథ్యంలో ముడి చమురు ధరలు రాత్రికి రాత్రే అతి భారీగా పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 26శాతం పెరిగి బ్యారెల్‌కు ఏకంగా 117.16 డాలర్ల వద్దకు చేరింది.
హర్ముజ్ జలసంధి వల్లే ఇదంతా వచ్చింది! ప్రపంచ చమురు సరఫరాకు జీవనాధారంగా భావించే ఈ హర్ముజ్ జలసంధి ఇరాన్ చేతుల్లో ఉంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. అందుకే, ముడి చమురు ధరలు ఈ స్థాయిలో పెరిగాయి.
చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా ఒకటి. మన దేశ అవసరాల్లో 85-90శాతం ముడి చమురు విదేశాల నుంచే వస్తుంది. తాజా పరిణామాలతో దేశంలో సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉండటం ఆవేదనకు గురిచేస్తోంది. సాధారణంగా.. ఒక బ్యారెల్‌పై ఒక్క డాలరు పెరిగినా, దేశ ఆర్థిక వ్యవస్థపై సుమారు రూ. 16వేల కోట్ల భారం పడుతుంది. అలాంటిది.. ఇప్పుడు ముడి చమురు ఏకంగా 26శాతం పెరిగింది!
{{/usCountry}}చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా ఒకటి. మన దేశ అవసరాల్లో 85-90శాతం ముడి చమురు విదేశాల నుంచే వస్తుంది. తాజా పరిణామాలతో దేశంలో సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉండటం ఆవేదనకు గురిచేస్తోంది. సాధారణంగా.. ఒక బ్యారెల్‌పై ఒక్క డాలరు పెరిగినా, దేశ ఆర్థిక వ్యవస్థపై సుమారు రూ. 16వేల కోట్ల భారం పడుతుంది. అలాంటిది.. ఇప్పుడు ముడి చమురు ఏకంగా 26శాతం పెరిగింది!
{{/usCountry}}ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ వెళితో.. దేశంలో ద్రవ్యోల్బణం కూడా వృద్ధి చెందుతుంది. ఇదే జరిగితే, వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ స్టాండ్ మారొచ్చు! ఇది ఇన్వెస్టర్లకు మరో ఆందోళనకర విషయం.
2. పడిపోతున్న రూపాయి విలువ..
తాజా పరిణామాల నేపథ్యంలో 'రూపాయి' పరిస్థితి కూడా బాగోలేదు! రోజురోజుకూ రూపాయి విలువ క్షిణిస్తూనే ఉంది. సోమవారం డాలరుతో పోల్చితే రూపాయి విలువ 0.5శాతం పడి 92.19కి చేరింది.
రూపాయి బలహీన పడుతూ ఉంటే ఎఫ్ఐఐలు (ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) స్టాక్ మార్కెట్లో తమ వాటాను కట్ చేసుకుంటారు. ఇది మరింత సెల్లింగ్‌కి దారి తీస్తుంది.
3. కనపడని ముగింపు..
స్టాక్ మార్కెట్లకు అనిశ్చితి అంటే ఇష్టం ఉండదు! పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పుడు శాంతియుతంగా మారతాయో ప్రస్తుతం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇది ఎంత ఎక్కువ రోజులు కొనసాగితే, సూచీలకు అంత నష్టాలు తప్పవు! ఇది ఇన్వెస్టర్లను భయపెడుతోంది.