...
...
Next Story

Stock market holiday : ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు అలర్ట్​- ఈ రోజు స్టాక్​ మార్కెట్లకు సెలవు..

గుడ్ ఫ్రైడే సందర్భంగా నేడు (ఏప్రిల్ 3, శుక్రవారం) భారతీయ స్టాక్ మార్కెట్లు పని చేయవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలతో పాటు కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్ కూడా క్లోజ్ అయ్యాయి. తిరిగి సోమవారం నుంచి ట్రేడింగ్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి.

Published on: Apr 3, 2026, 07:30:16 IST
Advertisement

గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని నేడు, ఏప్రిల్ 3న భారతీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్​ఛేంజీలైన బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ)లలో నేడు ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు.

స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..

ఈ వారంలో మార్కెట్లకు ఇది రెండో సెలవు కావడం గమనార్హం. అంతకుముందు మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు మూతపడ్డాయి. అలాగే ఏప్రిల్ నెలలో ఇదే మొదటి సెలవు.

అధికారిక హాలిడే క్యాలెండర్ ప్రకారం, నేడు ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్​) వంటి అన్ని విభాగాల్లో ట్రేడింగ్ నిలిచిపోయింది. శుక్రవారంతో పాటు శని, ఆదివారాలు కూడా సెలవులు కావడంతో తిరిగి ఏప్రిల్ 6, సోమవారం ఉదయం నుంచి మార్కెట్లు యథావిధిగా ప్రారంభమవుతాయి.

కమోడిటీ మార్కెట్ కూడా బంద్..

దేశంలోనే అతిపెద్ద కమోడిటీ ఎక్స్​ఛేంజ్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్​) కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా నేడు మూతపడింది. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలోనూ ట్రేడింగ్ ఉండదు. దీనివల్ల బంగారం, వెండి, కాపర్, ముడి చమురు వంటి వస్తువుల ఫ్యూచర్స్ ట్రేడింగ్ నేడు పూర్తిగా నిలిచిపోయింది.

గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి..

భారత మార్కెట్లే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన స్టాక్ మార్కెట్లు కూడా నేడు గుడ్ ఫ్రైడే సెలవును పాటిస్తున్నాయి. అమెరికా మార్కెట్లతో పాటు మెజారిటీ ఆసియా, యూరోపియన్ మార్కెట్లు నేడు పనిచేయడం లేదు.

ఏప్రిల్‌లో మరిన్ని సెలవులు..

ఈ నెలలో మొత్తం రెండు రోజులు స్టాక్ మార్కెట్లకు సెలవులు ఉన్నాయి. నేటి గుడ్ ఫ్రైడే తర్వాత, ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లు మళ్లీ మూతపడనున్నాయి. శని, ఆదివారాలు మినహాయించి ఈ నెలలో అదనంగా ఈ రెండు రోజులు ట్రేడింగ్ జరగదు.

ఇరాన్​ యుద్ధం నేపథ్యంలో గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 185 పాయింట్లు పెరిగి 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50 34 పాయింట్లు వృద్ధిచెంది 22,713 వద్దకు చేరింది. బ్యాంక్​ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 51,549 వద్ద సెషన్​ని ముగించింది.

గురువారం ట్రేడింగ్ సెషన్​లో ఎఫ్​ఐఐలు 9,931.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,208.41 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks