అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో పడుతూనే ఉన్నాయి. మంగళవారం సైతం సూచీలు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1456 పాయింట్లు పడి 74,559 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 436 పాయింట్లు కోల్పోయి 23,380 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 885 పాయింట్లు పడి 53,555 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,959.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,990.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 66 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో బలమైన బేర్ క్యాండిల్ ఏర్పడింది. ఫలితంగా ఇటీవలే ఏర్పడిన కన్సాలిడేషన్ పాటర్న్ బ్రేక్ అయ్యింది. నిఫ్టీ50కి 23,150- 23,100 లెవల్స్ సపోర్ట్గాను, 23,600 రెసిస్టెన్స్గాను ఉన్నాయి,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.01 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.16శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.71 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ముడి చమురు ధర..
{{/usCountry}}ముడి చమురు ధర పెరుగుతూనే ఉంది! అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం అవ్వడం ఇందుకు కారణం. బ్రెంట్ క్రూడ్ 0.96శాతం వృద్ధిచెంది బ్యారెల్‌కి 106.74 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఆర్ఆర్ కబెల్- బై రూ. 1938, స్టాప్ లాస్ రూ. 1850, టార్గెట్ రూ. 2070
వీ2 రీటైల్- బై రూ. 220, స్టాప్ లాస్ రూ. 210, టార్గెట్ రూ. 235
బజాజ్ కన్జ్యూమర్ కేర్- బై రూ. 547, స్టాప్ లాస్ రూ. 520, టార్గెట్ రూ. 600
వన్‌సోర్స్ స్పెషాలిటీ ఫార్మా- బై రూ. 1830, స్టాప్ లాస్ రూ. 1740, టార్గెట్ రూ. 1950
బ్లిస్ జీవీఎస్ ఫార్మా- బై రూ. 274, స్టాప్ లాస్ రూ. 264, టార్గెట్ రూ. 300