ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల వేళ సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,837 పాయింట్లు పడి 72,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 602 పాయింట్లు కోల్పోయి 22,513 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1989 పాయింట్లు పడి 51,438 వద్దకు చేరింది.
అయితే, మార్కెట్లు ముగిసిన తర్వాత, ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో యుద్ధం ముగింపుపై ప్రపంచవ్యాప్తంగా ఆశలు మొదలయ్యాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లకు అత్యంత సానుకూలంగా మారింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9,665.00 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,353.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“ఇక్కడి నుంచి నిఫ్టీ50 కిందకు పడితే 22000-21800 లెవల్స్ వరకు వెళ్లొచ్చు. 22,700- 22,800 లెవల్స్ వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.38 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.15శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.38 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 2.2శాతం మేర లాభాల్లో దూసుకెళుతోంది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 2.2శాతం మేర లాభాల్లో దూసుకెళుతోంది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్- బై రూ. 562.3, స్టాప్ లాస్ రూ. 538, టార్గెట్ రూ. 615
సన్ టీవీ నెట్వర్క్- బై రూ. 599.10, స్టాప్ లాస్ రూ. 575, టార్గెట్ రూ. 640
గుజరాత్ ఫ్లోరోకెమికల్స్- బై రూ. 3248.2, స్టాప్ లాస్ రూ. 3130, టార్గెట్ రూ. 3440
ప్రీమియర్ ఎనర్జీస్- బై రూ. 868.55, స్టాప్ లాస్ రూ. 827, టార్గెట్ రూ. 950
టెక్ మహీంద్రా- బై రూ. 1384, స్టాప్ లాస్ రూ. 1330, టార్గెట్ రూ. 1500