గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 151 పాయింట్లు పడి 73,833 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 53 పాయింట్లు కోల్పోయి 23,162 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 76 పాయింట్లు పెరిగి 55,177 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడం, శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో శుక్రవారం ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,987.09 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,224.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 290 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 23,000 బ్రేక్ అయితే మరింత కరెక్షన్ కనిపించవచ్చు. అదే సమయంలో 23,500 లెవల్ వద్ద రెసిస్టెన్స్ ఉంది. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి, స్టాక్ ఆధారిత అవకాశాల కోసం చూడాలి,” అని రెలిగేర్ బ్రోకింగ్‌కి చెందిన ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.86 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.75శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.54 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 3.4శాతం పెరిగింది.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 3.4శాతం పెరిగింది.
ముడి చమురు ధర..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం వార్తల మధ్య ముడి చమురు ధర పతనమైంది. బ్రెంట్ క్రూడ్ చాలా రోజుల అనంతరం 90 డాలర్ల దిగువకు వచ్చింది. ప్రస్తుతం 1.3శాతం పతనమై బ్యారెల్‌కి 89.17 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఇండియా సిమెంట్స్- బై రూ. 385, స్టాప్ లాస్ రూ. 371, టార్గెట్ రూ. 412
టొరంట్ ఫార్మా- బై రూ. 4572, స్టాప్ లాస్ రూ. 4410, టార్గెట్ రూ. 4890
హెచ్‌యూఎల్- బై రూ. 2140, స్టాప్ లాస్ రూ. 2080, టార్గెట్ రూ. 2200
ఎం అండ్ ఎం- బై రూ. 3005, స్టాప్ లాస్ రూ. 2950, టార్గెట్ రూ. 3120
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ. 963, స్టాప్ లాస్ రూ. 950, టార్గెట్ రూ. 995
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జిందాల్ పాలీ ఫిల్మ్- బై రూ. 732, స్టాప్ లాస్ రూ. 689, టార్గెట్ రూ. 815
ఎస్ఐఎస్- బై రూ. 429, స్టాప్ లాస్ రూ. 407, టార్గెట్ రూ. 470
అజంత ఫార్మా- బై రూ. 3143, స్టాప్ లాస్ రూ. 3000, టార్గెట్ రూ. 3420
ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1317, స్టాప్ లాస్ రూ. 1250, టార్గెట్ రూ. 1430
నియోజెన్ కెమికల్స్- బై రూ. 2029, స్టాప్ లాస్ రూ. 1930, టార్గెట్ రూ. 2200