శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 505 పాయింట్లు పెరిగి 78,494 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 157 పాయింట్లు వృద్ధిచెంది 24,354 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 479 పాయింట్లు పెరిగి 56,566 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 683 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,722 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం వీక్లీ ఛార్ట్‌లో నిఫ్టీ50 వరుసగా మూడో వారం బుల్లిష్ క్యాండిల్ని ఫార్మ్ చేసింది. ఇది కొనుగోళ్ల జోరుకు సంకేతం.
“నిఫ్టీ50 డైలీ ఛార్ట్‌లో కూడా లాంగ్ బుల్ క్యాండిల్ ఏర్పడింది. టెక్నికల్‌గా చూసుకుంటే మార్కెట్లో అప్‌ట్రెండ్ కనిపిస్తోంది. నిఫ్టీ50కి ప్రస్తుతం 24,400 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే 24,800 వరకు కూడా వెళ్లొచ్చు. 24,100 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
కాగా అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో బిగినర్లు అప్రమత్తంగా ఉండాలని, ట్రేడింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.79 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.20శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.5 శాతం పెరిగింది.
{{/usCountry}}శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.79 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.20శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.5 శాతం పెరిగింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
హర్ముజ్ జలసంధిపై ఇరాన్ మళ్లీ ఆంక్షలు విధించడంతో ముడి చమురు ధర జంప్ అయ్యింది. బ్రెంట్ క్రూడ్ 5.47శాతం పెరిగి బ్యారెల్‌కి 95.32డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
సుమిటోమో కెమికల్- బై రూ. 442, స్టాప్ లాస్ రూ. 426, టార్గెట్ రూ. 474
కమిన్స్ ఇండియా- బై రూ. 5141, స్టాప్ లాస్ రూ. 4960, టార్గెట్ రూ. 5503
ఎస్బీఐ- బై రూ. 1080, స్టాప్ లాస్ రూ. 1055, టార్గెట్ రూ. 1130
ఇన్ఫోసిస్- బై రూ. 1320, స్టాప్ లాస్ రూ. 1280, టార్గెట్ రూ. 160
ఇండిగో- బై రూ. 4634, స్టాప్ లాస్ రూ. 4600, టార్గెట్ రూ. 4750
మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్- బై రూ. 2615, స్టాప్ లాస్ రూ. 2565, టార్గెట్ రూ. 2770
జీపీపీఎల్- బై రూ. 160.9, స్టాప్ లాస్ రూ. 156, టార్గెట్ రూ. 174
డైనమిక్ కేబుల్స్- బై రూ. 332.95, స్టాప్ లాస్ రూ. 325, టార్గెట్ రూ. 355