2026 మొదటి ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32 పాయింట్లు పడి 85,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 17 పాయింట్లు వృద్ధిచెంది 26,147 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 59,712 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,268.6 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,525.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 26,250- 26,330 లెవల్స్ వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. అక్కడ సూచీ కన్సాలిడేట్ అవ్వొచ్చు. 26,000 వద్ద సపోర్ట్ ఉంది,” అని బజాజ్ బ్రోకింగ్ నిపుణులు వెల్లడించారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
న్యూ ఇయర్ సందర్భంగా అమెరికా స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
- 8వ వేతన సంఘం అమలైతే స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపు.. ఏయే రంగాలకు లాభం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
స్టాక్స్ టు బై..
ఇండస్ టవర్ లిమిటెడ్- బై రూ. 436, స్టాప్ లాస్ రూ. 420, టార్గెట్ రూ. 468
{{/usCountry}}ఇండస్ టవర్ లిమిటెడ్- బై రూ. 436, స్టాప్ లాస్ రూ. 420, టార్గెట్ రూ. 468
{{/usCountry}}జేకే టైర్స్- బై రూ. 517, స్టాప్ లాస్ రూ. 500, టార్గెట్ రూ. 551
సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్- బై రూ. 639, స్టాప్ లాస్ రూ. 628, టార్గెట్ రూ. 660
సెయిల్- బై రూ. 149, స్టాప్ లాస్ రూ. 142, టార్గెట్ రూ. 158
సన్ ఫార్మా- బై రూ. 1725, స్టాప్ లాస్ రూ. 1700, టార్గెట్ రూ .1770
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ప్రతాప్ స్నాక్స్- బై రూ. 1218, స్టాప్ లాస్ రూ. 1170, టార్గెట్ రూ. 1300
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్- బై రూ. 986.60, స్టాప్ లాస్ రూ. 950, టార్గెట్ రూ. 1070
కేఈఐ ఇండస్ట్రీస్- బై రూ. 4514.5, స్టాప్ లాస్ రూ. 4320, టార్గెట్ రూ. 4900
ఎన్టీపీసీ- బై రూ. 336.3, స్టాప్ లాస్ రూ. 323, టార్గెట్ రూ. 360
బ్యాంక్ ఆఫ్ ఇండియా- బై రూ. 146.99, స్టాప్ లాస్ రూ. 140, టార్గెట్ రూ. 160