...
...
Next Story

Stocks to buy : మరింత పడిన ముడి చమురు ధర- స్టాక్​ మార్కెట్​లకు ఊరట! ఈ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..

Stock market updates : మార్చ్​ 11, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు ముడి చమురు ధర, లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 11, 2026, 08:25:39 IST
Advertisement

ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా అనిశ్చితుల మధ్య సోమవారం కనిపించిన భారీ పతనం అనంతరం మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు కోలుకున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 640 పాయింట్లు పెరిగి 78,206 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 236 పాయింట్లు వృద్ధిచెంది 24,262 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 931 పాయింట్లు పెరిగి 56,951 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,672.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,333.26 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 డైలీ చార్ట్​లో లాంగ్​ లోయర్​ షాడోతో కూడిన చిన్న రెడ్​ క్యాండిల్​ ఏర్పడింది. ఇది బుల్లిష్​కి వ్యతిరేక సిగ్నల్​. అంటే 24,400- 24,500 లెవల్స్​ వద్ద బలమైన రెసిస్టెన్స్​ ఉందని అర్థం, నిఫ్టీ మీడియం టర్మ్​ ఔట్​లుక్​ నెగిటివ్​గా ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.07 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.21శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.01 శాతం పెరిగింది.

సోమవారం అత్యంత భారీగా పెరిగి బ్యారెల్​కు 119 డాలర్లు దాటిన బ్రెంట్​ క్రూడ్​ ధర ఇప్పుడు దిగొస్తోంది. తమ రిజర్వుల నుంచి భారీ మొత్తంలో (చరిత్రలోనే మునుపెన్నడు లేనంత) చమురును విడుదల చేస్తామని ఇంటర్నేషనల్​ ఎనర్జీ ఏజెన్సీ చేసిన ప్రకటనతో బ్రెంట్​ క్రూడ్​ పడింది.

ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్​కు 87.57 డాలరుకు చేరింది.

చమురు ధరలు పడటం స్టాక్​ మార్కెట్​లకు మంచి విషయం.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

అనుపమ్​ రసాయన్​ ఇండియా- బై రూ. 1294.10, స్టాప్​లాస్​ రూ. 1220, టార్గెట్​ రూ. 1400

సెనైడర్​ ఎలక్టరిక్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​- బై రూ. 923.60, స్టాప్​ లాస్​ రూ. 880, టార్గెట్​ రూ. 1000

ఎంఎం ఫోర్జింగ్స్​- బై రూ. 446.8, స్టాప్​ లాస్​ రూ. 425, టార్గెట్​ రూ. 485

గోదావరి పవర్​ అండ్​ ఇస్పాట్​- బై రూ. 253.80, స్టాప్​ లాస్​ రూ. 241, టార్గెట్​ రూ. 275

ఔరబిందో ఫార్మా- బై రూ. 1285.90, స్టాప్​ లాస్​ రూ. 1240, టార్గెట్​ రూ. 1400

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe