గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్లు పడి 82,249 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 14 పాయింట్లు పెరిగి 25,497 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి 61,188 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,465.99 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,031.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“ప్రస్తుతం మార్కెట్లో డైరక్షన్ లేదు. బ్రేకౌట్ కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. నిఫ్టీ50లో 25,600- 25,700 లెవల్స్ తక్షణ బ్రేకౌట్ జోన్‌గా ఉంది. 25,500- 25,300 బ్రేక్ అయితే అమ్మకాల ఒత్తిడి పెరుగుతుంది,” అని కొటాక్ సెక్యూరిటీస్ హెడ్ ఈక్విటీ రీసెర్చ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.03 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.54శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.18 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
బంగారం, వెండి ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 5200 డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 88 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 5200 డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 88 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఐఓసీ- బై రూ. 186.5, స్టాప్ లాస్ రూ. 180, టార్గెట్ రూ. 200
శ్రీరామ్ ఫైనాన్స్- బై రూ. 1105, స్టాప్ లాస్ రూ. 1065, టార్గెట్ రూ. 1185
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ- బై రూ. 498, స్టాప్ లాస్ రూ. 485, టార్గెట్ రూ. 530
సీఈఎస్సీ- బై రూ. 160, స్టాప్ లాస్ రూ. 155, టార్గెట్ రూ. 170
పాలసీ బజార్- బై రూ. 1525, స్టాప్ లాస్ రూ. 1485, టార్గెట్ రూ. 1580
ఐడియా ఫోర్జ్- బై రూ. 424.60, స్టాప్ లాస్ రూ. 415, టార్గెట్ రూ. 455
కేఈసీ ఇంటర్నేషనల్- బై రూ. 595, స్టాప్ లాస్ రూ. 583, టార్గెట్ రూ. 640
బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్..
ఇండస్ఇండ్ బ్యాంక్- బై రూ. 965, స్టాప్ లాస్ రూ. 930, టార్గెట్ రూ. 1040
జామ్నా ఆటో- బై రూ. 148.2, స్టాప్ లాస్ రూ. 142.5, టార్గెట్ రూ. 162
ఇంజనీర్స్ ఇండియా- బై రూ. 224, స్టాప్ లాస్ రూ. 216, టార్గెట్ రూ. 240
లిండే ఇండియా- బై రూ. 6895, స్టాప్ లాస్ రూ. 6636, టార్గెట్ రూ. 7400
మ్యాన్ ఇండస్ట్రీస్- బై రూ. 450, స్టాప్ లాస్ రూ. 434, టార్గెట్ రూ. 487