ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా అనిశ్చితుల మధ్య సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1353 పాయింట్లు పడి 77,566 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 422 పాయింట్లు కోల్పోయి 24,028 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1763 పాయింట్లు పడి 56,010 వద్దకు చేరింది.
ఒకానొక సమయంలో సూచీలు మరింత దారుణంగా పడ్డాయి. నిఫ్టీ50 దాదాపు 700 పాయింట్లు వరకు డౌన్ అయ్యింది. కాగా కింది స్థాయిలు నుంచి కొనుగోళ్లు కనిపించాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6,345.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,013.8 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ మార్చ్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 28,176.76 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 41,800.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 270 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 24,00- 23,900 లెవల్స్ కీలక సపోర్ట్ జోన్‌గా ఉన్నాయి. దాని దిగువకు పడితే సూచీలో మరింత అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. అక్కడి నుంచి 23,700కి, ఆ తర్వాత 23,500కి కూడా వెళ్లొచ్చు,” అని కొటాక్ సెక్యూరిటీస్ వెల్లడించింది.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.5 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.83శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.3 శాతం వృద్ధిచెందింది.
{{/usCountry}}సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.5 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.83శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.3 శాతం వృద్ధిచెందింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సానుకూలత నెలకొంది.
చమురు ధరలు..
సోమవారం అత్యంత భారీగా పెరిగి బ్యారెల్‌కు రూ. 119 డాలర్లు దాటిన ముడి చమురు ధర, మంగళవారం దిగొచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 6శాతానికిపైగా పడి బ్యారెల్‌కు 92.45 డాలర్లకు చేరింది.
ఇరాన్‌తో యుద్ధం ఎక్కువ కాలం కొనసాగపోవచ్చు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో చమురు ధరలు పడ్డాయి.
ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
స్టాక్స్ టు బై..
డేటా పాటర్న్స్- బై రూ. 3500, స్టాప్ లాస్ రూ. 3390, టార్గెట్ రూ. 3850 (మల్టీడే)
ఔరఫార్మా- బై రూ. 1250, స్టాప్ లాస్ రూ. 1199, టార్గెట్ రూ. 1350 (మల్టీడే)
వీఈడీఎల్- బై రూ. 711, స్టాప్ లాస్ రూ. 699, టార్గెట్ రూ. 760 (మల్టీడే)