Gift nifty live : సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్లు పెరిగి 78,520 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 11 పాయింట్లు వృద్ధిచెంది 24,365 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 56,582 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,059.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,966.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50.. 50-డే ఈఎంఐ దగ్గర కన్సాలిడేషన్ అవుతోంది. హయ్యర్ హై- హయ్యర్ హై పాటర్న్‌ని ఏర్పాటుచేస్తోంది. నిఫ్టీ50కి 24,100 వద్ద సపోర్ట్ ఉంది. 24,500 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. ఏది బ్రేక్ అయినా, సూచీ అటువైపు వెళుతుంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.01 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.24శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.26 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఇరాన్- అమెరికా మధ్య ఈ వారం శాంతి చర్చలు ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో ముడి చమురు ధర పడింది. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1శాతం మేర కరెక్ట్ అయ్యి బ్యారెల్‌కి 94.53 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
షాపర్స్ స్టాప్- బై రూ. 310, స్టాప్ లాస్ రూ. 307, టార్గెట్ రూ. 316
కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా- బై రూ. 54, స్టాప్ లాస్ రూ. 52, టార్గెట్ రూ. 58
ఐషేర్ మోటార్స్- బై రూ. 7220, స్టాప్ లాస్ రూ. 7180, టార్గెట్ రూ. 7300
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
సీఈఎస్సీ- బై రూ. 179.4, స్టాప్ లాస్ రూ. 170, టార్గెట్ రూ. 193
ఎంఎం ఫోర్డింగ్స్- బై రూ. 485, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 525
రాశి పెరిఫెరల్స్- బై రూ. 474, స్టాప్ లాస్ రూ. 450, టార్గెట్ రూ. 510
సిమెన్స్ ఎనర్జీ ఇండియా- బై రూ. 3138, స్టాప్ లాస్ రూ. 2980, టార్గెట్ రూ. 3138
గ్రిండ్‌వెల్ నార్టన్- బై రూ. 1627, స్టాప్ లాస్ రూ. 1550, టార్గెట్ రూ. 1750