...
...
Next Story

Stocks to buy : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 331 స్టాక్​తో లాభాలకు ఛాన్స్!

Gift nifty live : ఏప్రిల్​ 22, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 22, 2026, 08:15:02 IST
Advertisement

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 753 పాయింట్లు పెరిగి 79,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 212 పాయింట్లు వృద్ధిచెంది 24,577 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 789 పాయింట్లు పెరిగి 57,371 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

కాగా అమెరికాతో రెండో దఫా చర్చలను ఇరాన్ తిరస్కరించడం కారణంగా ప్రపంచ స్టాక్​ మార్కెట్​లలో ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,918.99 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,221.27 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 165 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“టెక్నికల్​గా చూసుకుంటే నిఫ్టీ50కి 24,350- 24,400 లెవల్స్​ కీలక సపోర్ట్​గా ఉన్నాయి. 24,700- 24,750 వద్ద రెసిస్టెన్స్​ కనిపిస్తోంది. డైలీ చార్ట్​ చూస్తుంటే మదుపర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపిస్తోంది,” అని చాయిస్​ బ్రోకింగ్​కి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్​ సుమీత్​ బగాడియా వివరించారు.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.59శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.63శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.59 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

స్ట్రెయిట్​ ఆఫ్​ హర్ముజ్​ వద్ద అనిశ్చితి వేళ ముడి చమురు ధర ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతోంది. బ్రెంట్​ క్రూడ్​ 0.2శాతం పడి బ్యారెల్​కి 98.27డాలర్ల వద్ద కొనసాగుతోంది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

బీహెచ్​ఈఎల్​ - బై రూ. 332.6, స్టాప్​ లస్​ రూ. 320, టార్గెట్​ రూ. 356

బజాజ్​ ఫైనాన్స్- బై రూ. 938.85, స్టాప్​ లాస్​ రూ. 905, టార్గెట్​ రూ. 1007

వెల్​స్పన్ కార్ప్- బై రూ. 1100.6, స్టాప్​ లాస్​ రూ. 1061, టార్గెట్​ రూ. 1182

హొనాసా కన్జ్యూమర్- బై రూ. 351.6, స్టాప్​ లాస్​ రూ. 338, టార్గెట్​ రూ. 380

లాయిండ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ- బై రూ. 1649.9, స్టాప్​ లాస్​ రూ. 1590, టార్గెట్​ రూ. 1790

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe