సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 787 పాయింట్లు పెరిగి 74,107 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 255 పాయింట్లు వృద్ధిచెంది 22,968 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1060 పాయింట్లు పెరిగి 52,609 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్‌కి ముందు కాల్పుల విరమణ ప్రతిపాదన వెళ్లిందన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు ప్రపంచ సూచీలు నెగిటివ్ నుంచి పాజిటివ్‌కి మారాయి. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించిందని ప్రస్తుతం మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,167.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,088.70 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో లోయర్ షాడోతో కూడిన భారీ బుల్ క్యాండిల్ ఏర్పడింది. ఇది షార్ట్‌టర్మ్ బాటమ్ రివర్సల్‌కి సంకేతం. నిఫ్టీ50కి 23,000 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే సూచీ 23,500 వరకు వెళ్లొచ్చు. 22,600 లెవల్స్ వద్ద సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.3 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.45శాతం వృద్ధి చెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.54 శాతం పెరిగింది.
{{/usCountry}}సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.3 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.45శాతం వృద్ధి చెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.54 శాతం పెరిగింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
ఇరాన్ యుద్ధం అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కి 0.5శాతం పెరిగి 110.34 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ- బై రూ. 1436.7, స్టాప్ లాస్ రూ. 1360, టార్గెట్ రూ. 1700
నైకా- బై రూ. 252.5, స్టాప్ లాస్ రూ. 243, టార్గెట్ రూ. 280
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ- బై రూ. 947.10, స్టాప్ లాస్ రూ. 914, టార్గెట్ రూ. 1040
సెయిల్- బై రూ. 160.4, స్టాప్ లాస్ రూ. 154.5, టార్గెట్ రూ. 174
ప్రాజ్ ఇండస్ట్రీస్- బై రూ. 344.75, స్టాప్ లాస్ రూ. 331, టార్గెట్ రూ. 372