ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మరింత ముదరడం, ప్రపంచ ఎనర్జీ మార్కెట్ తీవ్ర అనిశ్చితిలోకి జారుకోవడం వంటి కారణాలతో గురువారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2497 పాయింట్లు పడి 74,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 776 పాయింట్లు కోల్పోయి 23,002 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1875 పాయింట్లు పడి 53,451 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7,558.19 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,863.96 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 125 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో అప్పర్- లోయర్ షాడోలతో కూడిన బేరిష్ క్యాండిల్ ఏర్పడింది. ప్రస్తుతం సూచీ చాలా వీక్‌గా ఉంది. 23,350 వద్ద నిఫ్టీ50కి రెసిస్టెన్స్ ఉంది. సూచీ ఒకవేళ 22,900 దిగువకు చేరితే అక్కడి నుంచి 22,500కి కూడా వెళ్లొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.44 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.27శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.28 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
{{/usCountry}}ముడి చమురు ధరలు శుక్రవారం 1శాతం మేర పడ్డాయి. బ్రెంట్ క్రూడ్ 1.01శాతం పడి బ్యారెల్‌కు 107.57 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
టోరెంట్ పవర్- బై రూ. 1445.90, స్టాప్ లాస్ రూ. 1380, టార్గెట్ రూ. 1580
భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్- బై రూ. 251.75, స్టాప్ లాస్ రూ. 239, టార్గెట్ రూ. 275
లిండే ఇండియా- బై రూ. 7011.5, స్టాప్ లాస్ రూ. 6700, టార్గెట్ రూ. 7500
ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్- బై రూ. 787.9, స్టాప్ లాస్ రూ. 750, టార్గెట్ రూ. 860
కోల్ ఇండియా- బై రూ. 454.20, స్టాప్ లాస్ రూ. 438, టార్గెట్ రూ. 475