ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. గత వారం రోజుల్లో సూచీలు అతి భారీ నష్టాలను చూశాయి. మరీ ముఖ్యంగా శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1470 పాయింట్లు పడి 74,564 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 488 పాయింట్లు పతనమై 23,151 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1343 పాయింట్లు కోల్పోయి 53,758 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా గందరగోళం మొదలవ్వకముందు, అంటే ఫిబ్రవరి 27 సెన్సెక్స్ సుమారు 81,200 వద్ద, నిఫ్టీ50 25,170 దగ్గర ఉండేవి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 10,716.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,977.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ మార్చ్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 56,883.22 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 70,526.7 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 160 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 చార్ట్‌లో శుక్రవారం లాంగ్ బేర్ క్యాండిల్ ఏర్పడింది. ఇది వీక్నెస్కి చిహ్నం. ప్రస్తుతానికే సూచీ సపోర్ట్ దగ్గర ఉంది. కానీ అక్కడి నుంచి రివర్సెల్ని చూడొచ్చన్న కన్ఫర్మేషన్ మాత్రం లేదు. ఇది మంచి విషయం కాదు. ఈ వారం సూచీలో 22,900 దగ్గర పుల్‌బ్యాక్ కనిపించాలి. అది జరగకపోతే నిఫ్టీ50 22,500- 22,000 లెవల్స్ వరకూ కూడా వెళ్లొచ్చు. 23,500 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.26 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.61శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.93 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.26 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.61శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.93 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
ప్రపంచ చమురు సరఫరాకు జీవినాధారంగా భావించే హర్ముజ్ జలసంధిపై సందిగ్ధత తొలగకపోవడం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లపైనే కొనసాగుతోంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 102.90 డాలర్ల వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
లుమాక్స్ ఆటో టెక్నాలజీస్- బై రూ. 1434, స్టాప్ లాస్ రూ. 1379, టార్గెట్ రూ. 1537
థర్మల్ లిమిటెడ్- బై రూ. 3221, స్టాప్ లాస్ రూ. 2087, టార్గెట్ రూ. 3447
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ- బై రూ. 463, స్టాప్ లాస్ రూ. 443, టార్గెట్ రూ. 500
మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్- బై రూ. 850, స్టాప్ లాస్ రూ. 815, టార్గెట్ రూ. 905
అలివస్ లైఫ్ సైన్సెస్- బై రూ. 945, స్టాప్ లాస్ రూ. 915, టార్గెట్ రూ. 1010